Breaking News

జెప్టో కేఫ్‌ దూకుడు.. ప్రత్యేక యాప్‌

Published on Thu, 12/12/2024 - 14:05

క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌లో జెప్టో దూకుడు ప్రదర్శిస్తోంది. జెప్టో కేఫ్‌ను ప్రత్యేక యాప్‌గా అందుబాటులోకి తీసుకు రానున్నట్టు క్విక్‌ కామర్స్‌ కంపెనీ జెప్టో సహ వ్యవస్థాపకుడు ఆదిత్‌ పాలిచా తెలిపారు. కేఫ్‌ సేవలకు ఆదరణ పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

నెలకు 100కుపైగా కేఫ్‌లను ప్రారంభిస్తున్నామని,  ఇప్పటికే రోజుకు 30,000 పైచిలుకు ఆర్డర్లను అందుకుంటున్నామని వివరించారు. జెప్టో వేదికగా 2022 ఏప్రిల్‌లో జెప్టో కేఫ్‌ ప్రారంభం అయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న స్టోర్లలో 120 కంటే ఎక్కువ కేఫ్‌ల ద్వారా ప్రధాన నగరాలకు తన కేఫ్‌ సేవను విస్తరించనున్నట్లు గత నెలలో కంపెనీ ప్రకటించింది.

హైదరాబాద్, చెన్నై, పుణే సైతం విస్తరణ జాబితాలో ఉన్నాయని వివరించింది. వార్షిక ప్రాతిపదికన జెప్టో కేఫ్‌ వ్యాపారం ప్రస్తుతం రూ.160 కోట్ల స్థాయిలో నమోదవుతోందని వెల్లడించింది. కొత్త నగరాల్లో విస్తరణ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వార్షిక సగటు రేటు సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా సంస్థలో మరో కీలక పరిణామం జరిగింది. చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మార్టిన్ దినేష్ గోమెజ్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీలో చేరిన ఏడాదిలోపే ఆయన నిష్క్రమించడం గమనార్హం. జనవరిలో చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా చేరిన చందన్ మెండిరట్టా అక్టోబర్ నెలాఖరు నుండి చీఫ్ కల్చర్ ఆఫీసర్‌ బాధ్యతలతోపాటు హోచ్‌ఆర్‌ అధిపతిగానూ కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)