Breaking News

జీ ప్రమోటర్లకు వాటాదారుల చెక్‌

Published on Sat, 07/12/2025 - 04:31

న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీల్‌)లో ప్రమోటర్ల వాటా పెంపు ప్రతిపాదనను తాజాగా వాటాదారులు తిరస్కరించారు. పూర్తిస్థాయిలో మార్పిడి చేసుకునే వారంట్ల జారీ ద్వారా ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు జీల్‌లో రూ. 2,237 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రతిపాదించాయి. దీంతో ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కంపెనీలో వాటాను 18.4 శాతానికి పెంచుకునేందుకు ప్రతిపాదించాయి. అయితే ఇందుకు వాటాదారులు అనుమతించనట్లు కంపెనీ తెలియజేసింది. ప్రత్యేక రిజల్యూషన్‌ ద్వారా చేపట్టిన ప్రతిపాదనకు 59.51 శాతం వాటాదారులు అనుకూలత వ్యక్తం చేసినప్పటికీ 40.48 శాతం వ్యతిరేకించినట్లు వెల్లడించింది. ప్రత్యేక రిజల్యూషన్‌ చేపడితే కనీసం 75 శాతంమంది వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని వివరించింది.  

గత నెలలో ప్రతిపాదన 
గత నెలలో జీల్‌ ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు వారంట్ల జారీ ద్వారా రూ. 2,237.44 కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. తద్వారా ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడే వీలుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ బోర్డు పూర్తిగా మార్పిడికి వీలయ్యే 16.95 కోట్ల వారంట్ల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఆలి్టలిస్‌ టెక్నాలజీస్, సన్‌బ్రైట్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తదితర ప్రమోటర్‌ సంస్థలకు వారంట్లను జారీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీలో అతిపెద్ద వాటాదారు సంస్థ నార్జెస్‌ బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ జీల్‌ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాక్సీ అడ్వయిజరీ సంస్థ గ్లాస్‌ లెవిస్‌ సైతం సానుకూలంగా ఓటు చేయమని వాటాదారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ప్రమోటర్ల వాటా పెంపునకు వాటాదారుల తిరస్కరణ వార్తలతో జీల్‌ షేరు బీఎస్‌ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 137 వద్ద ముగిసింది.  
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు