Breaking News

యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గం

Published on Fri, 10/25/2024 - 15:21

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ 'యూట్యూబ్' భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లు మరింత ఆదాయాన్ని పొందడానికి సరికొత్త మార్గాన్ని పరిచయం చేసింది. 'షాపింగ్ ప్రోగ్రామ్‌' పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ వీడియోలలో ఉత్పత్తులను ట్యాగ్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బు ఆర్జించవచ్చు.

ఇప్పటికే ఈ షాపింగ్ ప్రోగ్రామ్‌ అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు దీనిని భారతీయ కంటెంట్ క్రియేటర్ల కోసం పరిచయం చేసింది. దీనికోసం యూట్యూబ్ ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్హులైన వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.

షాపింగ్ ప్రోగ్రామ్‌ ఫీచర్ కోసం కంటెంట్ క్రియేటర్లు.. యూట్యూబ్‌ షాపింగ్‌లో సైనప్‌ అవ్వాలి. మీ అప్లికేషన్‌ను ప్లాట్‌ఫామ్‌ ఆమోదించిన తరువాత షాపింగ్ ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు క్రియేట్ చేసే వీడియోలలో, షార్ట్స్, లైవ్ స్టీమ్ వంటి వాటిలో ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు, ఒక వీడియోకు సుమారు 30 ఉత్పత్తులను ట్యాగ్ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తులు యూజర్లకు కనిపిస్తాయి.

యూజర్లు ఈ ఉత్పత్తులను చూసి, వారికి నచినట్లయితే దానిపైన క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు, అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేయడంతో యూట్యూబర్లకు కమీషన్ వస్తుంది. యూజర్ ఒక ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే.. ఎంత కమీషన్ వస్తుందనే వివరాలను కూడా క్రియేటర్ అక్కడే చూడవచ్చు.

ఇదీ చదవండి: ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..

షాపింగ్ ప్రోగ్రామ్‌ ఫీచర్ యాక్సెస్ పొందాలంటే.. కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 10,000 సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. అన్ని అర్హతలు ఉన్న క్రియేటర్‌లు సేల్స్ కమీషన్‌ పొందవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ ఆదాయంలో వాటా తీసుకోవాలని యూట్యూబ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో అంశం ఏమిటంటే.. పిల్లల కోసం రూపోందించిన యూట్యూబ్ చానళ్లకు, మ్యూజిక్ చానళ్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)