Breaking News

యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్‌!

Published on Fri, 01/23/2026 - 16:09

ఈ రోజుల్లో యూట్యూబ్ చాలామంది జీవితాల్లో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ లాంటి చిన్న వీడియోలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే రోజూ కొత్త వీడియోలు చేయడం క్రియేటర్లకు కొంత కష్టంగా మారుతోంది. ఈ సమయంలో.. యూట్యూబ్ ఒక కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. అదే ఏఐ డిజిటల్ ట్విన్ (డిజిటల్ క్లోన్). యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన 206 వార్షిక లేఖలో ఈ ఫీచర్ గురించి వెల్లడించారు.

ఏఐ డిజిటల్ ట్విన్ ద్వారా.. క్రియేటర్స్ ఏఐ జనరేటెడ్ వెర్షన్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తమలాగే కనిపించే ప్రతిరూపం సాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.

ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?, ఇదెలా పని చేస్తుంది? అనే విషయాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ఇది ఓపెన్ఏఐ సొర యాప్ మాదిరిగా ఫోటోరియలిస్టిక్ వెర్షన్‌లను సృష్టించడానికి ఎలా అనుమతిస్తుందో అదే విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

యూట్యూబ్ షార్ట్స్ రోజుకు 200 బిలియన్ వ్యూవ్స్ పొందుతున్నాయి. ఈ సమయంలో దీనికోసం కొత్త ఫీచర్స్ కూడా సంస్థ సీఈఓ మోహన్ వెల్లడించారు. ఇందులో ఇమేజ్ పోస్ట్‌లను నేరుగా ఫీడ్‌లోకి జోడించవచ్చు. పిల్లలు & టీనేజర్లు షార్ట్స్ స్క్రోలింగ్ చేయడానికి ఎంత సమయం వెచ్చించాలనేది కూడా తల్లిదండ్రులకు కంట్రోల్ చేయవచ్చు. దీనికోసం కూడా ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత పేరెంట్స్ టైమర్‌ సెట్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!

#

Tags : 1

Videos

Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..

Perni Nani: జగన్ ట్రెండ్ సెట్టర్.. మీరు ఫాలోవర్స్..

GVMC ఉద్యోగి భౌతికకాయానికి YSRCP నేతల నివాళులు

ఉదయగిరిలో మగ పెద్ద పులి జాగ్రత్త..అటవీశాఖ హెచ్చరిక

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని

RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

Chandrasekhar : సచివాలయం ఉద్యోగులను చంపేస్తున్నారు.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావ్

Kakinada : ఈ ప్రభుత్వానికి ఓటు వేసి నరకం చూస్తున్నాం..

Photos

+5

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్‌ డే పార్టీలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

Anchor Suma : అందం పెరుగుతోంది కానీ తగ్గట్లేదు (ఫోటోలు)

+5

లుక్‌ టెస్ట్‌ అంటూ ఫోటోలు వదిలిన శివాత్మిక రాజశేఖర్‌

+5

సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

జిమ్‌లో కష్టపడుతున్న అనసూయ (ఫోటోలు)

+5

ఆర్సీబీ క్వీన్స్‌.. అదిరిపోయే లుక్స్‌.. స్మృతి స్పెషల్‌ (ఫొటోలు)

+5

కళ్లతో మాయ చేస్తూ.. అనుపమ గ్లామర్ షో (ఫొటోలు)

+5

మంచు ముద్దలలో మునిగిన లోయ (ఫొటోలు)

+5

ఇది అంతులేని కథలా.. సిట్‌ విచారణ వేళ కేటీఆర్‌ (చిత్రాలు)