ఫ్రెండ్‌ యూట్యూబ్ ఛానెల్‌ని రూ. 26వేల కోట్ల కంపెనీగా మార్చాడు, షాకింగ్‌ శాలరీ!

Published on Wed, 04/19/2023 - 18:37

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎడ్-టెక్ కంపెనీలలో ఒకటి అన్‌ఎకాడెమీ. స్థాపించిన అయిదేళ్లలోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా అన్‌ఎకాడెమీ సక్సెస్‌లో  కోఫౌండర్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా హేమేష్ సింగ్  పాత్ర  చాలా కీలకం.  ఆ వివరాలేంటో చూద్దాం..! 

ఇంజనీర్‌గా ఉండి వ్యాపారవేత్తగా మారిన గౌరవ్ ముంజాల్ యూట్యూబ్  చానల్‌లే  తరువాతి కాలంలో అన్‌ఎకాడెమీగా ఆవిర్భవించింది.  26 వేల కోట్ల రూపాయల కంపెనీగా ఈ యూట్యూబ్ చానల్‌లే పునాది వేసింది. ముఖ్యంగా  ముంజాల్, స్నేహితుడు రోమన్ సైనీ, హేమేష్ సింగ్ త్రయం కలిసి అన్‌కాడెమీని విజయవంతమైన వ్యాపార సంస్థగా తీర్చిదిద్దారు. (అదరగొట్టిన టీసీఎస్‌: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్‌ చిట్కాలివిగో!)

గౌరవ్‌ ముంజాల్‌ ప్రేరణతో ఇంజనీర్ అయిన హేమేష్ సింగ్ కూడా ముంజాల్‌ యూట్యూబ్‌లో చానల్‌లో చేరారు. అనంతరం అన్‌ఎకాడెమీ సహ వ్యవస్థాపకుడుగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కంపెనీ ముందుకునడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అన్‌ఎకాడెమీలో  చేరడానికి ముందు ఫ్లాట్‌చాట్ సీటీవోగా పనిచేశారు. 2015లో ఫ్లాట్‌చాట్‌ను విడిచి పెట్టిన తర్వాత, హేమేష్ సింగ్ ,రమణ్ సైనీ, గౌరవ్ ముంజాల్‌తో కలిసి అన్‌ఎకాడెమీని స్థాపించారు. ఇక అంతే అప్పటినుంచి కంపెనీ శరవేగంగా  డెవలప్‌ అయింది.

అదిరిపోయే వేతనం
2022లో గౌరవ్ ముంజాల్  రూ. అన్‌ఎకాడెమీ సీఈఓగా రూ. 1.58 కోట్లు తీసుకోగా, హేమేష్ సింగ్ రూ. 1.19 కోట్లు, రోమన్ సైనీ రూ. 88 లక్షలు వార్షిక వేతనం అందుకున్నారు. అన్‌ఎకాడెమీ 2020లో యునికార్న్ క్లబ్‌లో చేరింది, ప్రస్తుతం దీని విలువ 3.4 బిలియన్లు డాలర్లు. కాగా హేమేష్ సింగ్ మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో నివసిస్తున్నారు. (యానివర్సరీ సేల్‌, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు)

కాగా యూట్యూబ్ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌గా గౌరవ్ ముంజాల్ 2010లో అన్‌ఎకాడెమీని స్టార్ట్‌ చేశారు. ఆ తరువాత హేమేష్‌, రమణ కోఫౌండర్స్‌గా 2015లో అధికారికంగా  కంపెనీ లాంచ్‌ అయింది. యూట్యూబ్ ద్వారా యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధమయ్యే వేలాది ఏఐఎస్‌ అభ్యర్థులకు అన్‌ఎకాడెమీ  కోచింగ్‌ ఇస్తుంది.  విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేని యుపిఎస్‌సి కోచింగ్‌కు వేదికను అందించాలనే లక్క్ష్యంతోనే ఆవిర్భవించింది అన్‌ఎకాడెమీ. కేవలం ఆరేళ్లలో, అన్‌ఎకాడెమీలో టీచర్స్‌ సంఖ్య  18వేలకు చేరింది. (ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్‌?)

(ఒకపుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్‌: కండోమ్‌ బిజినెస్‌తో రూ. 43వేల కోట్లు!)

Videos

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)