Breaking News

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్లకు..

Published on Sun, 07/23/2023 - 12:41

ఆధునిక ప్రపంచంలో సంపన్నులెవరు? అంటే వెంటనే గుర్తొచ్చేది ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. భారతదేశం విషయానికి వస్తే ముఖేష్ అంబానీ పేరు చెబుతారు. వీరందరికంటే ముందు ఒకప్పుడు ఈ భూమిపైన అత్యంత సంపన్నుడెవరు? అనగానే 'మన్స ముస' (Mansa Musa) పేరే వినిపించేది. ఇంతకీ ఆయనెవరు? ఈయన సంపద విలువ ఎంత ఉండొచ్చు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, 14వ శతాబ్దంలో ఆఫ్రికన్ చక్రవర్తి అయిన మన్స ముస ఈ భూమిపై నివసించిన అత్యంత ధనవంతుడని నమ్ముతారు. చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ సంపన్నుడు 1280 ADలో జన్మించినట్లు, పశ్చిమ ఆఫ్రికాలోని విస్తారమైన మాలి సామ్రాజ్యానికి 1312 ADలో రాజై పరిపాలించినట్లు తెలుస్తోంది. ఈయన సంపద విలువ సుమారు 400 బిలియన్ డాలర్లని అంచనా.. అంటే ఇప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 లక్షల కోట్లు కంటే ఎక్కువ.

మాన్సా మూసా సంపద.. 
ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ డాలర్లు. ఇప్పటి ప్రపంచ కుబేరులకంటే మన్స ముస సంపద రెట్టింపు అనే చెప్పాలి. అప్పట్లో ఆ దేశపు వనరులు ఉప్పు, బంగారం.

(ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!)

చరిత్రకారుల ప్రకారం.. హజ్ తీర్థయాత్ర కోసం మాలి నుంచి మక్కాకు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ప్రయాణం సాగించిన అతి తక్కువ మందిలో మన్స ముస ఒకరని, అప్పట్లోనే ఈ మార్గంలో వంద ఒంటెలు, భారీ మొత్తంలో బంగారం, 12000 మంది సేవకులు, 8000 మంది అనుచరులను తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!)

మన్స ముస ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన రాజు మాత్రమే కాదు, దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఇతన్ని 'కింగ్ ఆఫ్ కింగ్స్' అని పిలిచేవారు. తన ప్రజలకు బంగారాన్ని విరివిగా దానం చేసేవాడని, మాలి సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని ఉత్పత్తి చేసిన ఘనత పొందిందని చెబుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)