Breaking News

హర్ష్‌ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?

Published on Wed, 10/09/2024 - 13:54

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వినియోగంపై ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్‌ చేశారు. ఇటీవల కమెడియన్‌ కునాల్ కమ్రా, భవిష్‌ అగర్వాల్‌ మధ్య ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.

హర్ష్‌ గోయెంకా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్‌ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్‌ వాడుతాను’ అన్నారు. తన ట్విట్‌లో కునాల్‌ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.

ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్‌ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్‌ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్‌ పోస్టు’ అని అగర్వాల్‌ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు

ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థకు సెంట్రల్ కన్జూమర్‌ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)