Breaking News

ఇంత తక్కువ ధరకు రైల్వే స్టేషన్‌లో రూమ్ లభిస్తుందని తెలుసా!

Published on Mon, 07/03/2023 - 18:36

IRCTC Retiring Rooms: ఇండియన్ రైల్వే మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ప్రయాణికుల వల్ల మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్న రైల్వే శాఖ ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. సంస్థ అందించే చాలా సౌకర్యాలను గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఈ కథనంలో అతి తక్కువ ధరకే హోటల్ రూమ్ లాంటి గదులను ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలను తెలుసుకుందాం.

నిజానికి రైలు ప్రయాణం చేసేవారు స్టేషన్‌లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినప్పుడు కొంత మంది ప్లాట్‌ఫామ్ మీదనే ఉండిపోతారు. కొంత మంది సమీపంలో ఉన్న హోటల్ రూమ్స్ కోసం వెళతారు. కానీ రైల్వే స్టేషన్లలోనే అలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. వాటిని రిటైరింగ్ రూమ్స్ అంటారు.

రైల్వే స్టేషన్లలో ఏసీ, నాన్ ఏసీ గదులు (సింగిల్, డబుల్ బెడ్) అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి ధరలు రూ. 100 నుంచి రూ. 700 వరకు ఉంటాయి. చాలా వరకు కేవలం వందకే రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా టికెట్ క‌న్ఫర్మ్ అయి ఉండాలి. లేకుంటే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ సదుపాయం పెద్ద పెద్ద స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి.

రిటైరింగ్ రూమ్ ఇలా బుక్ చేసుకోండి..

  • టికెట్ క‌న్ఫర్మ్ అయిన ప్యాసింజర్లు ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • ఆ తరువాత మై బుకింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్ళాలి, టికెట్ బుకింగ్ కింద రిటైరింగ్ రూమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన క్లిక్ చేయగానే రూమ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. 
  • ఆ ఆప్షన్‍లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా సర్చ్ చేసుకోవాలి.
  • మీరు ఏ స్టేషన్‌లో ఉండాలనుకుంటున్నారు అనేది ఎంచుకోవాలి.
  • అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మషన్, జర్నీ టైమ్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
  • చెక్ ఇన్, చెక్ అవుట్, బెడ్ టైప్, ఏసీ, నాన్ ఏసీ వంటివి ఎంపిక చేసుకుని, ఖాళీ ఎక్కడ ఉందో చూసుకుని బుక్ చేసుకోవాలి.
  • రూమ్ నెంబర్, ఐడీ కార్డు టైప్ వంటి వాటిని సెలక్ట్ చేసుకున్న తరువాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత రూమ్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

(ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌)

ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్ చార్జెస్ & రద్దు చేసుకునే విధానం

ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జ్ రిటైరింగ్ రూమ్‌కు 24 గంటల వరకు రూ.20, డార్మిటరీ బెడ్‌కు 24 గంటల వరకు రూ.10 ఉంటుంది. అదే సమయంలో రిటైరింగ్ రూమ్‌ 24 గంటల నుంచి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ధరలు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించడం జరుగుతుంది.

  • బుక్ చేసుకున్న తరువాత 48 గంటల వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు.
  • ఒక వేళా 48 గంటలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో రద్దు చేసుకుంటే 10 శాతం తగ్గింపు ఉంటుంది.
  • రూమ్ తీసుకునే రోజు రద్దు చేసుకుంటే 50 శాతం తగ్గింపు ఉంటుంది.

(ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!)

గుర్తుంచుకోవలసిన విషయాలు

  • ప్రయాణికులు రూమ్ బుక్ చేసుకుంటే రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు.
  • వెయిట్-లిస్ట్‌లో ఉన్నప్పుడు రూమ్‌లను బుక్ చేసుకోవడం కుదరదు.
  • ఆన్‌లైన్‌లో బుకింగ్ చేస్తే, క్యాన్సిల్ కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
  • ఒక వేళా ట్రైన్ రద్దు అయితే, నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన డబ్బు తిరిగి వాపసు పొందుతాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)