Breaking News

కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Published on Tue, 07/18/2023 - 08:03

Bharat NCAP New Rules: ఆధునిక కాలంలో కార్లను కొనే చాలామంది వినియోగదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మరింత పటిష్టంగా రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి మన దేశంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత్ ఎన్​సీఏపీ' (Bharat NCAP) అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానుంది. మన దేశంలో తయారైన వాహనాలు మరింత భద్రతను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే దిగ్గజ ఆటోమొబైల్స్ సంస్థలు కూడా తమ అంగీకారం తెలిపాయి.

భారత్ ఎన్​సీఏపీ..
నిజానికి భారత్ ఎన్​సీఏపీ అంటే 'న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్'. ఇది భారతదేశంలోని వాహనాలను మరింత పటిష్టం చేయడానికి దోహదపడుతుంది. మన దేశంలో తయారైన వాహనాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతైన వాహనాలకు కూడా తప్పనిసరిగా భారత్ ఎన్​సీఏపీ సర్టిఫికెట్ ఉండాలి.

(ఇదీ చదవండి: వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!)

భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్ నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ చేసింది. దీని ప్రకారం వాహనం డిజైన్, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ వంటివి తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పటికే అమలులో ఉన్న గ్లోబల్ ఎన్​సీఏపీ అండ్ యూరో ఎన్​సీఏపీ రెండు కూడా ఈ నియమాలనే పాటిస్తున్నాయి.

(ఇదీ చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!)

ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎన్​సీఏపీ వాహనాలకు క్రాష్ టెస్ట్ నిర్వహించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది అందిస్తుంది. భారత్ ఎన్​సీఏపీ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో నిర్వహణ సంస్థ ఏదైనా షోరూమ్ నుంచి తమకు నచ్చిన కారుని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. మొత్తం మీద రానున్న రోజుల్లో భరతదేశంలో తయారయ్యే అన్ని కార్లు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తాయని తెలుస్తోంది.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)