ముంబైలో 'యోహాన్ పూనావాలా' కొత్త ఇల్లు: ఎన్ని కోట్లో తెలుసా?

Published on Fri, 08/09/2024 - 21:09

బిలియనీర్, ప్రముఖ పారిశ్రామికవేత్త యోహాన్ పూనావాలా, అతని భార్య మిచెల్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వెచ్చించి ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన భవనం విస్తీర్ణం 30,000 చదరపు అడుగులు. ఈ విశాలమైన.. విలాసవంతమైన భవనం ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన నివాసాలలో ఒకటి. దీనిని 'పూనావాలా మాన్షన్' అని పేరు పెట్టారు.

యోహాన్ పూనావాలా.. పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. ఈయన తండ్రి జవరాయ్ పూనావల్లా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కో ఫౌండర్. కాబట్టి యోహాన్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. యోహన్ భార్య మిచెల్ పూనావల్ల ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్.

రూ.500 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త భవనం విశాలమైన లేఅవుట్స్, విశాలమైన డాబాలను కలిగి ఉంది. ఇందులో కొంత భాగాన్ని పూనావాలా ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. ఇందులో మిచెల్ ఆయిల్ పెయింటింగ్‌లు, ఇతర విలువైన మొక్కలు ఉంటాయి.

ముంబైలో ఆస్తులను కలిగి ఉన్న ప్రముఖులు
దక్షిణ ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ వర్లీ 'ఓంకార్ 1973' ప్రాజెక్ట్‌లో 34 కోట్ల విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను, రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్‌లో రూ 30 కోట్ల ఆస్తిని & యువరాజ్ సింగ్ అదే పరిసరాల్లో  రూ.64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?

క్రికెటర్లు మాత్రమే కాకుండా సినీ నిర్మాత, డైరెక్టర్ 'దినేష్ విజన్' కూడా ముంబైలోని 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్‌లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని, అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)