Breaking News

Year End 2023: లాభాల స్వీకరణతో 2023కు వీడ్కోలు

Published on Sat, 12/30/2023 - 06:32

2023 ఏడాదిని స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ముగించింది. సూచీలు అయిదు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇంధన, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సెన్సెక్స్‌ 170 పాయింట్లు నష్టపోయి 72,240 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 21,731 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.

ఒక దశలో సెన్సెక్స్‌ 328 పాయింట్లు క్షీణించి 72,083 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 21,677 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ టెలికం, ఆటో, సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.  టాటా మోటార్స్‌ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.781 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం పెరిగి రూ.803 ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది నిఫ్టీ– 50 షేర్లలో రెట్టింపు లాభాలు(111%) పంచిన షేరు ఇదే.  
 
లాభాల్లో ఇన్నోవా క్యాప్‌టాబ్‌

ఇన్నోవా క్యాప్‌టాబ్‌ లిస్టింగ్‌ రోజు ఇన్వెస్టర్లను మెప్పించింది. ఇష్యూ ధర రూ. 448తో పోలిస్తే బీఎస్‌ఈలో 2 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 22 శాతం(రూ. 99)పైగా జంప్‌చేసి రూ. 547ను అధిగమించింది. చివరికి రూ. 97 లాభపడి రూ. 545 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోనూ రూ. 452 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 21 శాతం ఎగసి రూ. 543 సమీపంలో నిలిచింది.

సెకండరీ మార్కెట్‌ కోసం యూపీఐ
సెకండరీ మార్కెట్‌లో లావాదేవీల కోసం కూడా యూపీఐ సదుపాయాన్ని వచ్చే వారం అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది.

రూ. 82,00,000 కోట్ల సంపద సృష్టి  
ఈ ఏడాది సెన్సెక్స్‌ 19% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్‌ విలువ 2022 డిసెంబర్‌ ఆఖరకు రూ.282.38 లక్షల కోట్లు ఉండగా.., ఈ ఏడాది చివరి ట్రేడింగ్‌ నాటికి రూ.82 లక్షల కోట్లు పెరిగి రూ.364.05 లక్షల కోట్లకు చేరింది. విలువ పరంగా 4 ట్రిలియన్ల మార్కెట్‌ క్యాప్‌తో ప్రపంచలోనే అతిపెద్ద నాలుగవ నాలుగవ ఈక్విటీ మార్కెట్‌గా దలాల్‌ స్ట్రీట్‌ అవతరించింది.

2023లో 58 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.54,000 కోట్లు సమీకరించాయి. లిస్టింగ్‌ నాటి నుంచి ఇరెడా(220%), సైయంట్‌ డీఎల్‌ఎం(154%), నెట్‌వెబ్‌ టెక్నాలజీ(137%), టాటా టెక్నాలజీ(136%), విష్ణు ప్రకాశ్‌ ఆర్‌(118%) అత్యధిక లాభాలు పంచాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)