Breaking News

షియోమీ మరో ఎలక్ట్రిక్ కారు: జూలైలో లాంచ్!

Published on Sun, 05/25/2025 - 18:35

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారు అయిన షియోమీ (Xiaomi) తన 'వైయూ7' ఎలక్ట్రిక్ కారు అమ్మకాలను జూలైలో ప్రారంభించనున్నట్లు.. కంపెనీ సీఈఓ 'లీ జున్' పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్ చైనాలో టెస్లా బెస్ట్ సెల్లింగ్ కారు 'వై'కి ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది.

చైనా సంస్థ 'షియోమీ' ఇప్పటికే తన లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ 'ఎస్‌యూ7' (SU7) అల్ట్రా కారును కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరో కారును తీసుకురావడానికి సన్నద్ధమైంది. ఈ కొత్త వైయూ7 ఎలక్ట్రిక్ కారు.. ఒక సింగిల్ ఛార్జితో 835 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని ధర 60,000 - 70,000 యువాన్‌ల (సుమారు రూ.8 లక్షలు) వరకు ఉండే అవకాశం ఉంది. అయితే అధికారిక ధరలు జులైలో వెల్లడవుతాయి. ఈ కారు డిజైన్, ఇతర ఫీచర్స్ అన్నీ కూడా త్వరలోనే వెల్లడవుతాయి.

ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు
షియోమీ లాంచ్ చేసిన ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 2,58,000 యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందినట్లు తెలుస్తోంది. ఇది స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్‌లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..

ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)