Breaking News

షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!

Published on Sat, 02/24/2024 - 13:54

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్‌ యూవీ స్క్రీన్‌ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ పోర్ట్‌, స్పీకర్‌, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్‌ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది.

స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు.

అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. 

 ఈ ప్రొటెక్టర్‌లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్‌లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్‌లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)