Breaking News

అత్యంత ఖరీదైన క్రూయిజ్.. ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి!

Published on Wed, 09/17/2025 - 16:35

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ ప్రయాణానికి ప్రకటన విడుదలైంది. రీజెంట్ సెవెన్ సీస్ అనే సంస్థ "వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" పేరుతో 140 రోజుల క్రూయిజ్ ప్రయాణాన్ని ప్రకటించింది. మియామి నుండి న్యూయార్క్ వరకు వెళ్లే ఈ ‍సెవెన్‌ సీస్‌ స్ల్పెండర్‌ క్రూయిజ్‌ 6 ఖండాలు, 40 దేశాలు, 71 ఓడరేవులను కవర్ చేస్తుంది. ఈ విలాస సాగర యాత్ర 2027 జనవరి 11న ప్రారంభం కానుంది.

టికెట్‌ ధరలు ఇలా..
"వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" క్రూయిజ్‌ ఎక్కడం సామాన్యుల తరం కాదు. ఎందుకంటే అంతలా ఉన్నాయి టికెట్‌ ధరలు. ఎంట్రీ లెవల్ వరండా సూట్ల ఛార్జీలే ఒక్కొక్కరికి సుమారు రూ .80 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇక టాప్-ఎండ్ రీజెంట్ సూట్ కావాలంటే దాదాపు రూ .7.3 కోట్లు అవుతుంది. వాణిజ్య క్రూయిజ్ మార్కెట్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.

ఏమిటి ప్రత్యేకతలు?
సముద్ర ఉపరితలంపై అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు అందించడంలో రీజెంట్ సూట్‌లకు సుదీర్ఘ ఖ్యాతి ఉంది.  ప్రతి పోర్ట్ లోనూ ప్రైవేట్ కారు, డ్రైవర్, ఇన్-సూట్ స్పా, క్యూరేటెడ్ ఫైన్ ఆర్ట్, 4,000 చదరపు అడుగుల ప్రైవేట్ స్పేస్‌ వంటి అల్ట్రా-ఎక్స్ క్లూజివ్ వసతులను అతిథులకు కల్పిస్తుంది.

రీజెంట్ 2026లో సెవెన్ సీస్ ప్రెస్టీజ్ లో ఇంకా పెద్ద స్కైవ్యూ రీజెంట్ సూట్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. దీని ధర ఒక్క రోజుకి సుమారు రూ .20-22 లక్షలు. ఇది అత్యంత ఖరీదైన సూట్ రేటుగా రికార్డుకెక్కింది.

ఆరు ఖండాలలో ప్రయాణం
2027 "వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్" క్రూయిజ్ అతిథులు లాస్ ఏంజిల్స్, సిడ్నీ, సింగపూర్, మాలిబు,  ముంబై వంటి ప్రధాన నగరాల్లో రాత్రి బస చేసి ఆరు ఖండాల గుండా 35,668 నాటికల్ మైళ్ళు (66,057 కిమీ) ప్రయాణిస్తారు.

మార్గం వెంట 486 కాంప్లిమెంటరీ షోర్ విహారయాత్రలు, మూడు ప్రత్యేకమైన తీరప్రాంత గాలా ఈవెంట్ లు, ఇంటర్‌కాంటినెంటల్‌ బిజినెస్‌ లేదా ఫస్ట్-క్లాస్ విమానాలు, లగ్జరీ హోటల్ బసలు, లగేజ్‌ సర్వీస్‌, ప్రీమియం బేవరేజీలు, స్పెషాలిటీ డైనింగ్, వాలెట్ లాండ్రీ, వై-ఫై, 24 గంటల ఇన్-సూట్ డైనింగ్ వంటివెన్నో ఈ విలాస ప్రయాణంలో ఉన్నాయి.

ఈ ‍క్రూయిజ్‌కు భారత్‌లో నాలుగు స్టాప్ లు ఉన్నాయి. ముంబై, మంగళూరు, కొచ్చి, గోవాలో ఈ క్రూయిజ్‌ను యాత్రికులు ఎక్కొచ్చు.

Videos

ఉడతతో స్నేహం

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా

గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)