Breaking News

ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఈయనే..

Published on Fri, 07/07/2023 - 19:27

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్‌లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా  గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది.

500 ఎకరాల విస్తీర్ణం
లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది.

 

ఆకట్టుకునే కళాకృతులు
గుజరాత్‌లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్‌లో విస్తృతమైన ఇంటీరియర్‌ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్‌లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్‌లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం.

ఈయనే యజమాని 
లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్‌ఆర్‌హెచ్ సమర్జిత్‌సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నారు. సమర్జిత్‌సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది.

 

2013లో తన మామ సంగ్రామ్‌సింగ్ గైక్వాడ్‌తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్‌సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్‌సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)