Breaking News

ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి..

Published on Thu, 12/26/2024 - 11:51

ప్రపంచంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీలు (flying taxi) అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి ఈ ఫ్యూచరిస్టిక్ సర్వీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి (Abu Dhabi) వేదికగా ప్రపంచానికి పరిచయం కానుంది.

అంతేకాకుండా అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్‌ ల్యాండింగ్ (eVTOL) ఎయిర్‌ ‍క్రాఫ్ట్‌ల ఉత్పత్తి కూడా ఇక్కడే ప్రారంభం కానుందది. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినట్లయితే, అబుదాబి నగర వ్యాప్తంగా వెర్టిపోర్ట్‌లు ఏర్పాటవుతాయి. వీటిని కలుపుతూ వినూత్నమైన మిడ్‌నైట్ ఈవీటోల్‌లు (eVTOL) ఒక్కో ట్రిప్‌కు నలుగురు ప్రయాణికులను తీసుకువెళతాయి. ప్రయాణ సమయాన్ని 80 శాతం వరకు తగ్గిస్తాయి.

ఈవీటోల్‌ వాహనాలను విస్తృత ప్రయాణ సాధనాలుగా ఉపయోగించాలన్న ఆలోచన 2016లో ఉబెర్ తన ఎలివేట్ కాన్ఫరెన్స్‌లో ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పుడు విస్తృత దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కార్‌ రైడ్‌లను బుక్‌చేసుకుంటున్నంత సులభంగా భవిష్యత్తులో  ఫ్లయింగ్‌ ట్యాక్సీలను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు తీసుకురావాలని ఈ భావనకు కంపెనీ రూపకల్పన చేసింది.

అప్పటి నుండి ఈవీటోల్‌ పరిశ్రమ ఆసక్తిని పెంచుతూ వస్తోంది. దీనికి సంబంధించి 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉద్భవించాయి. ఇవి సమిష్టిగా దాదాపు 10 బిలియన్ డాలర్ల నిధులను పొందుతున్నాయి. అయితే పరిశోధనా సంస్థ ఐడీటెక్‌ఎక్స్‌ (IDTechEx) మాత్రం  ఇటీవలి తన అధ్యయనంలో 5% కంటే తక్కువ కంపెనీలు మాత్రమే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయని అంచనా వేసింది. కాగా వీటిలో ఆర్చర్ ఏవియేషన్ మొదటి మూడు అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

ఆర్చర్ అబుదాబిలో తన ప్రారంభ వాణిజ్య సేవను ప్రారంభించడం ద్వారా ముందస్తు ప్రయోజనాన్ని పొందాలని భావిస్తోంది. మిడ్‌నైట్ ఈవీటోల్‌ గరిష్టంగా గంటకు 240 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. ఆర్చర్ అమెరికా, భారత్‌, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, దాని యూఏఈ కార్యకలాపాలు అత్యంత ముందస్తు దశలో ఉన్నాయి.

Videos

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)