www.. ప్రపంచ గతిని మార్చిన 3 అక్షరాలు!

Published on Thu, 08/01/2024 - 06:30

ముప్ఫై ఐదేళ్ల క్రితం కనుక్కొన్న మూడు అక్షరాలు ప్రపంచ గతిని మార్చేశాయి. ఆ మూడు అక్షరాలు లేకుంటే ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంటర్నెట్‌ లేదు. ఆ మూడు అక్షరాలు www. అదే వరల్డ్ వైడ్ వెబ్. నేడు (ఆగస్ట్‌ 1) ఈ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం..

ఇదీ www చరిత్ర
ఇంటర్నెట్‌ అనేది కంప్యూటర్లను కలిపే నెట్‌వర్క్‌ అయితే వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్‌ వెబ్‌ పేజీలను కలిపే వ్యవస్థ. ఇది నేడు ప్రపంచాన్ని శాసించే వేలాది ఇతర ఆవిష్కరణల సృష్టికి దారితీసింది. అయితే, వరల్డ్ వైడ్ వెబ్ జనాల దృష్టికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. 1989లో టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన దీన్ని WWW అనే దాన్ని రూపొందించారు. 

బెల్జియన్ ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్ రాబర్ట్ కైలియాయు మరింత మెరుగుపరిచారు. వారిద్దరూ కలిసి హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (HTTP)ని అభివృద్ధి చేశారు. దాన్ని 1992లో ఆవిష్కరించారు. అనేక ఇతర గొప్ప సాంకేతికతల మాదిరిగానే WWW అనేది మొదట్లో సాధారణ ప్రజల కోసం రూపొందించింది కాదు. భౌతిక శాస్త్రవేత్తలు సమాచారాన్ని పంచుకోవడం కోసం దీన్ని రూపొందించారు. తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఇందులో మొదటి ఫోటో 1992లో బెర్నర్స్-లీ అప్‌లోడ్ చేశారు. 1990ల మధ్య నాటికి మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కూడగట్టుకోవడం ద్వారా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ మాధ్యమంగా నిరూపించుకుంది. 21వ శతాబ్దం నాటికి, వెబ్ వినియోగం కంప్యూటర్‌లతోపాటు స్మార్ట్‌ఫోన్‌లకు కూడా మారింది. నేడు, వరల్డ్ వైడ్ వెబ్‌ను గేమింగ్ పరికరాలు, సెల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వాచ్‌ల ద్వారా కూడా యాక్సెస్ చేస్తున్నారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ యాక్టివ్‌ యూజర్లున్నారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)