Breaking News

ఉద్యోగానికి రిజైన్ చేయకుండానే ప్రపంచ యాత్ర

Published on Thu, 07/16/2026 - 12:49

‘లక్షల రూపాయల ప్యాకేజీ ఉన్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రపంచాన్ని చుట్టేయడానికి బయలుదేరాను’ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా రీల్స్‌లో చాలా మంది ఇన్‌ఫ్యుయెన్సర్లు చెప్పడం చూశాం. స్థిరమైన కెరీర్‌ను వదులుకుంటేనే కలలను సాకారం చేసుకోగలమనే ఒక భ్రమను ఈ ధోరణి సృష్టిస్తోంది. అయితే, ఈ నెరేటివ్‌ను సవాలు చేస్తూ తన ఫుల్‌టైమ్‌ 9-5 జాజ్‌ను కాపాడుకుంటూనే ప్రపంచాన్ని చుట్టేస్తున్న పంజాబ్‌కు చెందిన లైఫ్‌స్టైల్, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ ఆనీ శర్మ సరికొత్త పంథాతో వార్తల్లో నిలిచారు.

ఆనీ శర్మ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం.. స్థిరమైన ఆదాయాన్ని, కెరీర్‌ను పణంగా పెట్టకుండానే ప్రయాణాల పట్ల ఉన్న అభిరుచిని ఎలా కొనసాగించవచ్చో నిరూపించారు. ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు కొందరు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ముందస్తు ప్రణాళిక: ప్రతి పర్యటనను కొన్ని నెలల ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవడం, బడ్జెట్‌ను క్రమశిక్షణతో నిర్వహించడం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయి.

శాండ్‌విచ్ పద్ధతి: ఆమె సాధారణంగా 4-5 రోజుల చిన్న ట్రిప్స్ కాకుండా 10 రోజుల సుదీర్ఘ పర్యటనలను ఎంచుకుంటారు. రెండు వారాంతాలను కలుపుతూ మధ్యలో వచ్చే పనిదినాలను మేనేజ్ చేస్తారు.

రిమోట్ వర్క్ వినియోగం: ఆమెకు ఉన్న రిమోట్ వర్క్ సౌలభ్యం దీనికి ఎంతో ఉపయోగపడుతోంది. పర్యటనలో ఉన్నప్పుడు వారాంతాల్లో స్థానిక ప్రాంతాలను అన్వేషిస్తూ పనిదినాల్లో రిమోట్‌గా ఆఫీస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

అదనపు ఆదాయ వనరులు: ఉద్యోగ జీతంతో పాటు సోషల్ మీడియా కొలాబొరేషన్స్, బ్రాండ్ స్పాన్సర్‌షిప్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రయాణ ఖర్చులను సమతుల్యం చేసుకుంటున్నారు.

ఉద్యోగాలు వదిలేయండనే తోటివారి ఒత్తిడికు లోనుకావద్దని ఆనీ శర్మ హితవు పలికారు. రిమోట్ వర్క్ సంస్కృతిని, సమయాన్ని స్మార్ట్‌గా మేనేజ్ చేసుకుంటే కెరీర్ ఎదుగుదలను, వ్యక్తిగత సంతోషాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లవచ్చని ఆమె చెప్పారు.

ఇదీ చదవండి: IRCTC వెబ్‌సైట్‌ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)