ప్రపంచంలో ఎత్తైన రెసిడెన్షియల్.. ఫిదా చేస్తున్న వీడియో

Published on Tue, 04/30/2024 - 12:34

దుబాయ్‌ అనగానే చాలామందికి ప్రపంచంలో ఎత్తైన భవనంగా కీర్తి గడిస్తున్న 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. అయితే త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ అందుబాటులోకి రానుంది. నగరంలోని మెరీనా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఈ రెసిడెన్షియల్ మొత్తం 122 అంతస్తులుగా నిర్మించనున్నారు.

'సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 517 మీటర్లు లేదా 1696 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్‌గా.. న్యూయార్క్ నగరంలోని 'సెంట్రల్ పార్క్ టవర్' (474 మీటర్లు లేదా 1550 అడుగులు) కంటే చాలా పొడవుగా ఉంటుంది.

సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌ను వుడ్స్ బాగోట్ అండ్ డబ్ల్యుఎస్పీ మిడిల్ ఈస్ట్ రూపొందించారు. ఇది గుండ్రంగా మెరుస్తున్న టవర్ మాదిరిగా ఉంటుంది. బాల్కనీలను, టెర్రస్ వంటి వాటిని కలుపుతూ చివరి బిందువు మాదిరిగా పూర్తయ్యి ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ మొత్తం మిచెల్ & ఈడెస్ పూర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అరబ్ యువరాజుకు సరిపోయే హై-ఎండ్ యాక్సెసరీస్, మెటీరియల్‌లను ఉపయోగించినట్లు సమాచారం.

సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌లో అత్యాధునిక ఫిట్‌నెస్ సౌకర్యాలు ఫంక్షనల్ జిమ్‌లు, వర్చువల్ సైక్లింగ్, బాక్సింగ్ స్టూడియోలు, ఇన్ఫినిటీ పూల్, ఐస్ బాత్‌లు, సాల్ట్ రూమ్, బయో, సౌండ్ హీలింగ్ రూమ్, మసాజ్ సూట్‌లు, ఇండోర్ అండ్ అవుట్‌డోర్ సినిమాస్ వంటి ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.

సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్ దుబాయ్ మెరీనాకు కొంత చరిత్ర కూడా ఉంది. ఇది 2007లో పెంటోమినియం టవర్‌గా ప్రారంభమైంది. తరువాత ఆనతి కాలంలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఇటీవలే సెలెక్ట్ గ్రూప్ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణం 25 శాతం పూర్తయింది. ఇది 2028 చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)