Breaking News

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి

Published on Mon, 07/31/2023 - 14:44

World Richest Thailand King: ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న సంపన్నులను గురించి.. ప్రపంచంలోని కుబేరుల గురించి కూడా కొంత వరకు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు అపారమైన సంపదను మాత్రమే కాకుండా వేల ఎకరాల భూమిని కలిగి, లెక్కకు మించిన వాహనాలను కలిగిన ఒక సంపన్న రాజును గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వేల ఎకరాల భూమి..
నివేదికల ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చెందిన మహారాజు 'మహా వజిరాలాంగ్‌కార్న్' (Maha Vajiralongkorn) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. ఈయన ఆస్తి సుమారు రూ. 3.2 లక్షల కోట్లు. అంతే కాకుండా వజ్రాలు, రత్నాలు వంటి వాటితో పాటు.. 16 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కూడా వజిరాలాంగ్‌కార్న్ అధీనంలో ఉండేదని సమాచారం.

ఖరీదైన డైమండ్.. 
భూముల విషయం పక్కనపెడితే మహా వజిరాలాంగ్‌కార్న్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 545.67 క్యారెట్ బ్రయోన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉండేదని.. దీని విలువ 12 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ (రూ. 98 కోట్లు) ఉంటుందని అంచనా, ఇది రాజు కిరీటంలో పొందుపరిచారు. వీటితో పాటు అపురూపమైన రాజ వాయిద్యాలు కూడా ఆయన వద్ద ఉండేవని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!

విమానాలు, హెలికాఫ్టర్లు & కార్లు..
బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా.. వజిరాలాంగ్‌కార్న్ దగ్గర ఏకంగా 38 విమానాలు, లెక్కకు మించిన హెలికాఫ్టర్లు ఉండేవి. ఇందులో నాలుగు బోయిన్, మూడు ఎయిర్‌బస్ విమానాలు. వీటితో పాటు 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు వీరి గ్యారేజిలో ఉండేవి. కేవలం వాహనాలకు వినియోగించే ఫ్యూయెల్ ఖర్చు మాత్రం సంవత్సరానికి రూ. 524 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ రాజు ఎంత సంపన్నుడో ఇట్టే తెలిసిపోతుంది.

ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు..

విశాలమైన ప్యాలెస్..
థాయ్‌లాండ్‌లోని గ్రాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఏకంగా 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించినట్లు సమాచారం. ఇది వారి వారసత్వానికి చిహ్నంగా చారిత్రాత్మక కట్టడంగా నిలిచింది. వజిరాలాంగ్‌కార్న్ రాజుని 'కింగ్ రామ ఎక్స్' అని కూడా పిలుస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)