Breaking News

World Migration Report 2024: భారత్‌కు మనవాళ్ల డబ్బేడబ్బు

Published on Thu, 05/09/2024 - 05:53

ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్‌) రికార్డు సృష్టించారు. భారత్‌కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్‌ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్‌ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్‌ నిలిచింది. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 

» రెమిటెన్సులకు సంబంధించి భారత్‌ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్‌ డాలర్లు), చైనా (51 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్‌ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది.  

» దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్‌–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ 30 బిలియన్‌ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌ 21.5 బిలియన్‌ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది.  

» 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. 

» విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా  అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్‌ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.

భారత్‌ పయనమిలా... 
(అంకెలు బిలియన్‌ డాలర్లలో) 
2010    53.48 
2015    68.91 
2020    83.15 
2022     111.22 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)