Breaking News

బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరిన ధర

Published on Sun, 10/05/2025 - 15:44

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ కారణంగా.. పెట్టుబడిదారులలో ఆందోళన మొదలైంది. డాలర్ విలువ రోజురోజుకి తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో బిట్‌కాయిన్ వాల్యూ ఆదివారం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకొని.. 1,25,000 డాలర్ల మార్కును దాటింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక బిట్‌కాయిన్ విలువ సుమారు రూ. 1.08 కోట్లు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ తాజాగా 1,25,689 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 14న నెలకొల్పిన 1,24,514 రికార్డును సైతం.. ఇప్పుడు అధిగమించింది. ప్రస్తుత పరిస్థితులు బిట్‌కాయిన్ విలువను అమాంతం పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అమెరికా స్టాక్‌లలో లాభాలు, బిట్‌కాయిన్ లింక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరిగాయి.

ఇటీవల ప్రారంభమైన ప్రభుత్వ షట్‌డౌన్.. డబ్బును సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టేలా చేసింది. మార్కెట్ వర్గాలు దీనిని 'డీబేస్‌మెంట్ ట్రేడ్' అని పిలుస్తున్నారు. "ఈక్విటీలు, బంగారం, పోకీమాన్ కార్డుల వంటి సేకరణలతో సహా అనేక ఆస్తులు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. డాలర్ విలువ తగ్గడం.. బిట్‌కాయిన్ విలువ పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని క్రిప్టో ప్రైమ్ బ్రోకరేజ్ సంస్థ ఫాల్కన్‌ఎక్స్ మార్కెట్ల కో హెడ్ జాషువా లిమ్ అన్నారు.

సాధారణంగా అక్టోబర్ నెల బిట్‌కాయిన్‌కు అనుకూలమైనది.. దీనిని "అప్‌టోబర్" అని మార్కెట్ నిపుణులు పిలుచుకుంటారు. గత కొన్నేళ్లుగా బిట్‌కాయిన్ పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.

బిట్‌కాయిన్ పెరుగుదలపై విక్రమ్ సుబ్బురాజ్ ఏమన్నారంటే?
బిట్‌కాయిన్ విలువ 125000 డాలర్లు దాటడం అనేది మరో మైలురాయి కాదు. గత కొంతకాలంగా దీని విలువ పెరుగుతూనే ఉంది. పరిస్థితులు కూడా బిట్‌కాయిన్‌కు అనుకూలంగా మారుతున్నాయి. దీనికి కారణం రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం, పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యం.. స్థిరమైన డిమాండ్ అని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. అంతే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బిట్‌కాయిన్ ఒక ప్రత్యేక ఆస్తి అని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్.. విజయ్ దేవరకొండ నెట్‌వ‌ర్త్ ఎంతో తెలుసా?

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)