Breaking News

‘మర మేస్త్రీ’.. రెండు రోజుల్లోనే ఇల్లు కట్టేస్తుంది!!

Published on Wed, 07/17/2024 - 21:18

ఇంటి నిర్మాణం అనేది సుదీర్ఘ ప్రక్రియ. శ్రామిక శక్తితో కూడుకున్నది. చాలా మంది కార్మికులు నెలలు, సంవత్సరాల తరబడి పనిచేస్తే కానీ నిర్మాణం పూర్తవ్వదు. కానీ టెక్నాలజీ సాయంతో ఇంటి నిర్మాణం రోజుల్లోనే పూర్తవుతోంది.

అన్నింటా ప్రవేశిస్తున్న రోబిటిక్‌ టెక్నాలజీ భవన నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది. 105 అడుగుల (32 మీటర్లు) టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన రోబోటిక్ ట్రక్ ఆస్ట్రేలియా నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. హాడ్రియన్ ఎక్స్ గా పిలిచే ఈ ట్రక్కును రోబోటిక్స్ కంపెనీ ఎఫ్ బీఆర్ అభివృద్ధి చేసింది. ఆ యంత్రం రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఇంటిని పూర్తి చేయగలదు. గత సంవత్సరం ఇది యూఎస్‌ఏ ఫార్మాట్‌లో గంటకు 500 ఇటుకలను పేర్చి తన పనితీరు ఏంటో చూపించింది.

ఇటుకలతో కూడిన ప్యాలెట్ లను లోడ్ చేశాక ఈ రోబోటిక్ వెహికల్/కన్ స్ట్రక్షన్ ఆర్మ్ తన పనిని మొదలు పెడుతుంది. ప్యాలెట్‌ నుంచి ఒక్కో ఇటుక ఆర్మ్‌ కొనకు చేరుకుంటుంది. ఇక్కడ క్విక్‌ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఇది సిమెంట్‌ లాగా పనిచేస్తుంది. మిశ్రమం అంటిన ఒక్కొక్క ఇటుకను రోబో ఆర్మ్‌ చక్కగా పేరుస్తూ నిర్మాణం పూర్తి చేస్తుంది. అధిక పొడవు కారణంగా మూడు అంతస్తుల ఎత్తుతో సైతం ఇది నిర్మాణాలను చేపడుతుంది.

అమెరికాలో అతిపెద్ద కాంక్రీట్ బ్లాక్ సరఫరాదారుల్లో ఒకటైన సీఆర్‌హెచ్ పీఎల్సీ అనుబంధ సంస్థ ఎఫ్‌బీఆర్, సీఆర్‌హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్‌ను ఫ్లోరిడాకు తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ బిల్డర్ తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లోని ఒక ఫెసిలిటీలో సైట్ అంగీకార పరీక్షను మొదట పూర్తి చేయాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే, ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్ ఐదు నుంచి 10 ఏక-అంతస్తుల గృహాలను నిర్మిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)