Breaking News

2024లో ముంచుకొస్తున్న ముప్పు..

Published on Mon, 02/05/2024 - 14:49

ఒకవైపు భారీవర్షాలు, తుపాన్లు, వరదలు మరోవైపు కరవు కాటకాలు.. వీటికితోడు ఇటీవల కాలంలో పెచ్చురిల్లుతున్న విభిన్న దాడులతో సామాన్యులు చితికిపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో  ఏఐ ఆధారిత మోసాలు, సైబర్‌దాడులు, రాజకీయమోసాలు 2024లో అధికం కాబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటికితోడు అంతర్జాతీయంగా ఎన్నో రిస్క్‌లు సంభవించబోతున్నట్లు అంచనావేస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) నివేదిక విడుదల చేసింది.

భారత్‌, అమెరికా, బ్రిటన్‌, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెనుముప్పుగా పరిణమించనుంది. ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా ఇది తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆర్థిక వేదిక వెలువరించిన ‘గ్లోబల్‌ రిస్క్‌ నివేదిక-2024’లో వెల్లడైంది.

ఆర్థిక, పర్యావరణ, రాయకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై ఈ నివేదిక ర్యాంకులను ప్రకటించింది. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉంది. అమెరికా ఆరోస్థానంలో ఉంది. కేవలం వాతావరణానికి సంబంధించి తప్పడు సమాచారం వల్ల కలిగే రిస్క్‌ 2024లో 100కు 66 శాతంగా ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. నివేదికలోని వివరాల ప్రకారం..(రిస్క్‌ శాతం)

1. తీవ్రమైన వాతావరణం    66%    
2. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారం 53%
3. సామాజికంగా/ రాజకీయంగా కలిగే రిస్క్‌ 46%
4. జీవన వ్యయం 42%
5. సైబర్ దాడులు    39%
6. ఆర్థిక తిరోగమనం 33%
7. కీలకమైన వస్తువుల సరఫరాలో అంతరాయం 25%
8. సాయుధ బలగాల మధ్య యుద్ధం 25%
9. మౌలిక సదుపాయాలపై దాడులు    19%
10. ఆహార సరఫరా గొలుసుల అంతరాయం 18%

#

Tags : 1

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)