Breaking News

కమోడిటీ, చమురు మార్కెట్లకు ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక

Published on Tue, 10/31/2023 - 12:08

మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల ప్రపంచ కమోడిటీ, ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇప్పటివరకు పరిమిత ప్రభావం ఉన్నప్పటికీ, ఇంధన మార్కెట్, ఆహార భద్రతపై కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపుతుందని తెలిపింది.

ప్రపంచబ్యాంక్‌ తాజా కమోడిటీ మార్కెట్లకు సంబంధించి ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో చమురు ధరలు సగటున బ్యారెల్‌కు 90 యూఎస్‌ డాలర్లు ఉంటుందని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో వచ్చే ఏడాది బ్యారెల్‌కు సగటున 81 డాలర్లకు తగ్గుతుంది. ప్రపంచ చమురు సరఫరా రోజుకు 20లక్షల నుంచి 5లక్షల బ్యారెళ్లకు తగ్గుతుందని దాంతో ధరలు 3-13 శాతం పెరుగుతాయని నివేదిక తెలిపింది.

వచ్చే ఏడాది మొత్తం కమోడిటీ ధరలు 4.1 శాతం తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. రానున్న కాలంలో సరఫరా పెరగడంతో వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. మూల లోహాల ధరలు 2024లో 5 శాతం తగ్గుతాయని తెలిసింది. అయితే 2025లో మాత్రం వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం. 

మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో 1970 తర్వాత తాజా యుద్ధ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మిత్‌గిల్‌ అన్నారు. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు