భారత్‌ వృద్ధి 6.3 శాతమే

Published on Wed, 06/11/2025 - 01:37

వాషింగ్టన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) భారత జీడీపీ 6.3 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్న గత అంచనాలను ప్రపంచబ్యాంక్‌ కొనసాగించింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు భారత ఎగుమతులపై చూపిస్తున్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంది. భారత్‌ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. 2025–26లో భారత వృద్ధి రేటు 6.7 శాతం ఉండొచ్చని జనవరిలో ప్రపంచబ్యాంక్‌ అంచనా వేయగా.. అమెరికా టారిఫ్‌లు, అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో దీన్ని 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఏప్రిల్‌లో ప్రకటించింది.

ఇప్పుడు మరోసారి ఏప్రిల్‌ అంచనానే కొనసాగిస్తున్నట్టు తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశి్చతులతో ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి 2.3 శాతానికి క్షీణిస్తుందంటూ తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనా కంటే ఇది అర శాతం తక్కువ. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఆర్థిక వ్యవస్థల వృద్ధి అంచనాల తగ్గింపునకు అంతర్జాతీయ అనిశ్చితులను కారణంగా ప్రపంచబ్యాంక్‌ ప్రస్తావించింది.  

ఎగుమతులకు అడ్డంకులు 
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2025–26 సంవత్సరానికి భారత్‌ 6.3 శాతంతో వేగవంతమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందని అంచనా వేస్తు న్నట్టు ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. అయినప్పటికీ జనవరి అంచనాలతో పోల్చి చూస్తే 0.4% తగ్గించడాన్ని గుర్తు చేసింది. కీలక భాగస్వామ్య దేశాలలో బలహీన కార్యకలాపాలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న అవరోధాలతో ఎగుమతులు క్షీణిస్తాయని అంచనా వేసింది. 2024–25లో భారత వృద్ది రేటు మోస్తరు స్థాయికి దిగిరావడాన్ని నివేదికలో ప్రస్తావించింది. ముఖ్యంగా పారిశ్రామికోత్పత్తి క్షీణించినట్టు తెలిపింది. నిర్మాణ రంగం, సేవల రంగంలో కార్యకలాపాలు స్థిరంగా ఉంటే, వ్యవసాయ రంగం బలంగా పుంజుకున్నట్టు గుర్తు చేసింది.  

2026–27 అంచనాలూ తగ్గింపు 
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 6.5 శాతం వృద్ధి సాధించొచ్చని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది. జనవరి అంచనాలతో పోల్చి చూస్తే 0.2 శాతం తక్కువ. పెట్టుబడుల వృద్ధి కూడా నిదానించొచ్చని పేర్కొంది. మరోవైపు చైనా 2025లో 4.5 శాతం, 2026లో 4 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని 
అంచనా వేసింది.  

ప్రపంచ వృద్ధి 2.3 శాతం
వాణిజ్య వివాదాల కారణంగా యూఎస్‌సహా ప్రపంచ వృద్ధి మందగించనున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వాణిజ్య సుంకాలకు తెరతీసిన నేపథ్యంలో ఆర్థిక పురోభివృద్ధి కుంటుపడనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి ప్రపంచ ఆర్థిక వృద్ధి 2.3 శాతానికి పరిమితంకానున్నట్లు అంచనా వేసింది. ట్రంప్‌ పేరు ప్రస్తావించని ప్రపంచ బ్యాంక్‌ వాణిజ్య ప్రతిబంధకాల కారణంగా యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 1.4 శాతం పుంజుకోవచ్చని పేర్కొంది. 2024లో సాధించిన 2.8 శాతం వృద్ధిలో ఇది సగంకాగా.. 2025 జనవరిలో వేసిన 2.3 శాతం అంచనాలను దిగువముఖంగా సవరించింది. ఈ బాటలో ప్రస్తుత ఏడాది(2025) ప్రపంచ వృద్ధి అంచనాలను సైతం 0.4 శాతం కుదించి 2.3 శాతానికి చేర్చింది. 2024లో 2.8 శాతం వృద్ధి నమోదైంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)