amp pages | Sakshi

‘మెదడు మొద్దుబారిపోతోంది.. ఆఫీసులకే వస్తం’

Published on Sat, 09/11/2021 - 14:27

థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆఫీసులను తెరిచే ఉద్దేశాన్ని చాలా కంపెనీలు వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే.  దీంతో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’.. జనవరి దాకా కంటిన్యూ కానుంది.  అయితే ఇక తమ వల్ల  కాదని, ఆఫీసులకు వచ్చేస్తామని కరాకండిగా చెప్పేస్తున్నారు కొందరు ఉద్యోగులు. అందుకు తమ దగ్గర సరైన కారణాలు ఉన్నాయంటున్నారు మరి!


రియల్‌ టైం కమ్యూనికేషన్‌ లోపం..  ఏడాదిన్నరగా ఉద్యోగుల మధ్య ఈ-మెయిల్స్‌, ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌లతో కంపెనీ పనులు జరుగుతున్నాయి. ఫోన్‌, వీడియో కాల్స్‌ ఆధారంగా మీటింగ్‌లను, సమీక్షలను నిర్వహించుకుంటున్నారు.  తద్వారా ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్స్‌ అనేది గణనీయంగా తగ్గిపోయింది.  

 కంపెనీ సక్సెస్‌లో టీం వర్క్ ఎంత శక్తివంతమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకోసమే టీంల మధ్య ఇంటెరాక్షన్‌ ఎక్కువ ఉండాలని చెప్తుంటారు. అయితే కరోనాకు ముందున్న పరిస్థితులతో పోలిస్తే.. సగటున వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్ల కొలీగ్స్‌ మధ్య గడిపే టైం 25 శాతం తగ్గిపోయింది. సోషల్‌ గ్యాదరింగ్‌లు లేకపోవడం, ఒకవేళ కలిసినా ఎక్కువసేపు గడపలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఇది ఇన్నోవేషన్‌తో పాటు కంపెనీ ప్రొడక్టివిటీపైనా నెగెటివ్‌ ప్రభావం చూపెడుతోంది. 

ఎంప్లాయిస్‌ వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది వర్క్‌ ఫ్రమ్‌ హోం సిస్టమ్‌. ఏడాదిన్నరగా ఇంటికే పరిమితం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య  తగదాలు నెలకొంటున్నాయి. పిల్లల వల్ల పనులు ఆగిపోతున్నాయనే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది పరోక్షంగా వర్క్‌ మీద చూపెడుతోంది. ఉద్యోగులను స్థిమితంగా ఉండనివ్వడం లేదు.  క్లిక్‌: నా భర్తను ఆఫీస్‌కు పిలవండి.. ప్లీజ్‌

టార్గెట్లు.. ఉద్యోగుల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు.  ఆఫీస్‌ స్పేస్‌లో లేకపోవడంతో మానిటరింగ్‌ పేరుతో  ఉద్యోగుల్ని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై శారీరక, మానసిక అనారోగ్యం బారినపడుతున్నారు.
 

మానసిక స్థితిపై ప్రభావం..  దీని ప్రభావంతో ఉద్యోగుల మెదడు మొద్దుబారిపోతోంది.  స్కిల్స్‌ను పెంచుకునే వాళ్లకు తీరిక లేకుండా చేస్తోంది. చివరికి..  జాబ్‌ మారాలనే ఆలోచనల్ని సైతం దూరం చేస్తున్నాయి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పరిస్థితులు. 

ఇంటర్నెట్‌ ఇష్యూస్‌. ఒక్కోసారి సిగ్నల్స్‌ లేక వర్క్‌ ఆగిపోవడం, ఆలస్యం కావడం.‌ చిరాకు తెప్పిస్తున్న అంశాలు. 

అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.. ఆఫీస్‌ అట్మాస్పియర్‌ను మిస్‌ కావడం. కెరీర్‌ ఎదుగుదలకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అడ్డుపడుతుందనే భావనలోకి కూరుకుపోతున్నారు ఉద్యోగులు . వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల జాబ్‌ సెక్యూరిటీ చూసుకుంటున్న ఉద్యోగులు చాలామట్టుకు.. హైక్‌లు, బోనస్‌లకు దూరంగా పని చేస్తున్నారు. ఇది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందనే ఆందోళన ఉద్యోగుల తరపు నుంచి వ్యక్తం అవుతోంది.   

 
టెక్‌ కంపెనీలు భారీ ఎత్తున్న నిర్వహించిన సర్వేలో ఎంప్లాయిస్‌ వెల్లడించిన అభిప్రాయాలివి. 


చదవండి: వర్క్‌ ఫ్రమ్‌లోనూ లైంగిక వేధింపులు.. ఇలా!

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)