Breaking News

నాన్‌టెక్‌లో టెకీలుగా దూసుకొస్తున్న మహిళలు

Published on Sat, 05/31/2025 - 07:52

ముంబై: టెక్‌యేతర రంగాల్లో మహిళా టెకీల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 2020 తర్వాత నుంచి ఈ ధోరణి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2020లో టెక్నాలజీ ఉద్యోగాల్లో మహిళల వాటా 1.90 శాతంగా ఉండగా, 2023లో 11.8 శాతానికి, 2024 నాటికి 14 శాతానికి పెరిగిందని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ ఒక నివేదికలో వెల్లడించింది. 2020–2024 మధ్యకాలంలో 13,000 మంది టీమ్‌లీజ్‌ డిజిటల్‌ టెక్‌ కాంట్రాక్ట్‌ సిబ్బంది డేటా విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించారు.

దీని ప్రకారం పురుషాధిక్యత ఉండే కాంట్రాక్ట్‌ ఉద్యోగాల్లో మహిళల వాటా 2020లో 9.51 శాతంగా ఉండగా 2024లో 27.98 శాతానికి పెరిగింది. నాన్‌–టెక్‌ రంగాల్లో టెక్నాలజీపరమైన విధుల్లో మహిళల నియామకాలు మెరుగుపడుతుండటాన్ని ఇది సూచిస్తోందని రిపోర్ట్‌ పేర్కొంది.  

  • నివేదికలోని మరిన్ని విశేషాలు.. 
        హోదాపరంగా చూస్తే సీనియర్‌ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం 3.35 శాతానికే పరిమితం కాగా, మిడ్‌–లెవెల్లో 4.07 శాతంగా, ఎంట్రీ స్థాయిలో 3.03 శాతంగా ఉంది. లీడర్‌షిప్‌ హోదాలను చేరుకోవడంలో మహిళలకు ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయనడానికి ఇది నిదర్శనం.

  •     పరిశ్రమలవారీగా నైపుణ్యాల ఆధారిత విశ్లేషణ ప్రకారం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో ఇటు నాన్‌–టెక్నికల్, అటు టెక్నికల్‌ నైపుణ్యాల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. ఇది వరుసగా 49.28 శాతం, 44.31 శాతంగా నమోదైంది. 47.32 శాతం, 34.58 శాతం వాటాతో లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఆ తర్వాత స్థానంలో నిల్చింది.  

  •     టెక్నాలజీయేతర రంగాల్లో టెకీ ఉద్యోగాల్లో మహిళల వాటా 14 శాతానికి చేరడమనేది సమ్మిళితత్వం పెరుగుతుండటాన్ని సూచిస్తోంది. అయితే, లీడర్‌షిప్‌ హోదాల్లో వారికి అంతగా ప్రాతినిధ్యం ఉండటం లేదు. ఈ అంతరాలను సరిచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి.

  •     మహిళలకు కూడా అవకాశాలు ..వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, పరిశ్రమపరమైన అవరోధాలను పరిష్కరించేలా, సిబ్బందిలో వారి సంఖ్య మరింత పెరిగేలా చూడటంపై కంపెనీలు మరింత దృష్టి పెట్టాలి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)