Breaking News

ఆటోమేషన్‌తో మహిళలకు అవకాశాలు

Published on Wed, 08/21/2024 - 08:49

తయారీ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. పురుషులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఈ రంగంలో ఆటోమేషన్‌ (మెషినరీ సాయంతో పనుల నిర్వహణ)తో మహిళల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనా వేస్తోంది. 2047 నాటికి 35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది భారత్‌ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో తయారీ రంగం మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఆటోమేషన్‌ను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది.

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ పి.సుబ్బురాతినమ్‌  మాట్లాడుతూ..‘దేశీయంగా చాలా కంపెనీలు దశలవారీ ఆటోమేషన్‌ను అమలు చేస్తున్నాయి. మహిళల నియామకాలు మొదలు పెట్టాయి. తయారీ రంగాల్లో ఆటోమేషన్‌ అమలు పెరుగుతున్న కొద్దీ కంపెనీలు మరింత మంది మహిళలను పనుల్లోకి తీసుకుంటున్నాయి. భారత తయారీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు 15–20 శాతంలోపే ఉంటారు. ఆటోమేషన్‌ను వేగంగా అమలు చేస్తున్న కంపెనీల్లో ఇప్పటికే మహిళల నియామకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు, టెలికం విడిభాగాల తయారీ సంస్థలు మరింత మంది మహిళలను తీసుకునేందుకు చర్యలు చేపట్టాయి. శ్రామికశక్తిలో లింగ సమతుల్యంపై కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి’ అని అన్నారు.

ఇదీ చదవండి: కార్ల ధరపై భారీ డిస్కౌంట్లు

కొన్ని విభాగాల్లో మెరుగైన అవకాశాలు

తయారీలో కొన్ని రంగాలు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుండడడాన్ని టీమ్‌లీజ్‌ నివేదిక ప్రస్తావించింది. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో కార్మికుల్లో 70–80 శాతం మహిళలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే టెక్స్‌టైల్స్, వస్త్రాల తయారీలోనూ సహజంగానే మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఫ్యాబ్రికేటెడ్, బేసిక్‌ మెటల్స్, మెషినరీ, ఎక్విప్‌మెంట్, మోటారు వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమల్లో కఠినమైన పని పరిస్థితుల దృష్ట్యా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని, వీటిల్లో ఆటోమేషన్‌ అమలు తక్కువగా ఉన్నట్టు టీమ్‌లీజ్‌ తెలిపింది. ఇక ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్‌లోనూ పురుషులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)