Breaking News

బ్లూ–గ్రే కాలర్‌ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా

Published on Fri, 07/25/2025 - 05:42

ముంబై: కార్మిక, నైపుణ్య ఉద్యోగాల్లో (బ్లూ–గ్రే కాలర్‌ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అదే సమయంలో చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉద్యోగం వీడుతుండడం (వలసల రేటు/అట్రిషన్‌) ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో బ్లూ–గ్రే కాలర్‌ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం 19 శాతానికి పెరిగింది. 2020–21 నాటికి వీరి భాగస్వామ్యం 16 శాతంగా ఉండడం గమనార్హం. కానీ, వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

 ముఖ్యంగా ఏడాది లోపు అనుభవం ఉన్న మహిళల ఎక్కువగా ఉద్యోగం మానేస్తున్నారు. ఈ వివరాలను ఉదైతి ఫౌండేషన్, క్వెస్‌కార్ప్‌ నివేదిక వెల్లడించింది. రిటైల్, తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, సేవల రంగాల్లో ఉద్యోగం చేస్తున్న 10,000 మంది మహిళలతోపాటు, ఉద్యోగం మానేసిన 1,500 మందిని సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. వలసలు ఎక్కువగా ఉండడం ఉత్పాదకతకు, 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్న సాకారానికి విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  

మహిళల అభిప్రాయాలు.. 
వచ్చే 12 నెలల్లో ఉద్యోగం వీడనున్నట్టు ఏడాది లోపు అనుభవం ఉన్న 52 శాతం మహిళా ఉద్యోగులు సర్వేలో తెలిపారు. అదే రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిలో ఇలా చెప్పిన వారు 3 శాతంగానే ఉండడం గమనార్హం. వలసల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లోనూ 54 శాతం తమ వేతనం విషయమై సంతృప్తిగా లేరు. 

80 శాతం మంది నెలకి రూ. 2,000 కన్నా తక్కువే పొదుపు చేస్తున్నారు. మంచి వేతనం ఇస్తే ఉద్యోగాల్లో తిరిగి చేరతామని 42 శాతం మంది చెప్పారు. 57 శాతం మంది రవాణా పరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటే, 11 శాతం మంది రాత్రి షిఫ్టుల్లో పని ప్రదేశానికి వెళ్లి రావడాన్ని భద్రంగా భావించడం లేదు. రూ.20వేల కంటే అధిక వేతనం పొందుతున్న వారు సమీప కాలంలో ఉద్యోగం విడిచి పెట్టిపోవడం 21 శాతం తక్కువగా ఉండొచ్చన్నది ఈ నివేదిక సారాంశం. 

వ్యవస్థలోనే లోపం.. 
‘‘భారత్‌ ఆర్థిక సామర్థ్యాల విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలకు ద్వారాలు తెరిచాం. కానీ, వారికి అనుకూలమైన వ్యవస్థల ఏర్పాటుతోనే వృద్ధి చెందగలరు. సామర్థ్యాలు లేకపోవడం వల్ల మహిళల ఉద్యోగాలు వీడడం లేదు. మహిళలు పనిచేసేందుకు, విజయాలు సాధించేందుకు అనుకూలమైన వసతులను మనం కలి్పంచలేకపోతున్నాం’’అని ఉదైతి ఫౌండేషన్‌ సీఈవో పూజ గోయల్‌ వివరించారు.    

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)