Breaking News

మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!

Published on Sun, 03/08/2026 - 21:02

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహిళలను స్మరించుకున్నారు. ఒక మనిషి విజయానికి కేవలం అతని కృషి మాత్రమే కాదు.. అతని కుటుంబం, ముఖ్యంగా మహిళల ప్రోత్సాహం, విలువలు, ప్రేమ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తన విజయాలకు పునాది తన కుటుంబ మహిళల నుంచే ఏర్పడిందని వెల్లడించారు.

గౌతమ్ అదానీ తన బాల్యంలో.. తన తల్లి శాంతాబెన్ అదానీ చెప్పిన కథలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా రామాయణంలోని కథలు ఆయనలో ధైర్యం, త్యాగం, బాధ్యత వంటి విలువలను నాటాయి. కేవలం 16 ఏళ్ల వయసులో ఆయన తన భవిష్యత్తు కోసం ముంబైకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆయన తల్లి ఎంతో ధైర్యంతో తన కుమారుడిని తెలియని భవిష్యత్తు వైపు నడిపించింది. ఆ త్యాగం & ప్రేమను ఆయన జీవితాంతం గుర్తుంచుకుంటానని భావోద్వేగానికి లోనయ్యారు.

అదానీ ఫౌండేషన్‌కు నాయకత్వం వహించడానికి దంతవైద్యంలో తన వృత్తిని విడిచిపెట్టిన తన భార్య ప్రీతి అదానీ గురించి కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో పనిచేస్తూ ఒక కోటి మందికి పైగా ప్రజలకు సహాయం అందిస్తోందని తెలిపారు.

తన కోడళ్లు పరిధి అదానీ & దివా అదానీలు కుటుంబంలోకి తాజా దృక్పథాలు & కొత్త శక్తిని తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు, అదే సమయంలో తన మనవరాలు తన జీవితంలోకి తెచ్చే ఆనందాన్ని గురించి కూడా పేర్కొన్నారు. పిల్లల కళ్లలో కనిపించే విశ్వాసం మరియు అమాయకత్వం జీవితం అసలు అర్థాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి: 2026లో ధనవతుల జాబితా: టాప్ 10లో వీరే..

మనిషి జీవితంలో పెద్ద కంపెనీలు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. కానీ నిజమైన బలమైన పునాదులు కాంక్రీట్ లేదా ఉక్కుతో నిర్మితం కావు. మన జీవితాన్ని ప్రభావితం చేసే మనుషులతో నిర్మితమవుతాయి అని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలు మన జీవితాలను తీర్చిదిద్దే గొప్ప శక్తిగా ఉంటారని గౌతమ్ అదానీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్