Breaking News

ఎట్టకేలకు శుభవార్త: కంపెనీ బోర్డుల్లో పెరుగుతున్న మహిళలు

Published on Tue, 10/18/2022 - 10:25

న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో (2013-2022) 18 శాతానికి చేరుకుంది. 2013లో ఇది 6 శాతంగా ఉండేది. 4,500 మంది పైచిలుకు డైరెక్టర్లు ఉన్న నిఫ్టీ 500 కంపెనీలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా విశ్లేషణ ఆధారంగా కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

కంపెనీల చట్టంలో తప్పనిసరి చేసిన ఫలితంగానే బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని నివేదిక పేర్కొంది. నిఫ్టీ 500లోని 95 శాతం కంపెనీల బోర్డుల్లో ఒక మహిళ ఉన్నారని వివరించింది. అయితే, మహిళా చైర్‌పర్సన్‌లు ఉన్న కంపెనీల సంఖ్య 5 శాతం కన్నా తక్కువేనని పేర్కొంది. బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంపై కంపెనీలు ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. ప్రయత్నాలు అంత వేగంగా పురోగమించడం లేదని వివరించింది. చారిత్రకంగా చూస్తే భారతీయ సంస్థల బోర్డుల్లోని మహిళలకు ఎక్కువగా ఫిర్యాదుల పరిష్కారం, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాŠిన్సబిలిటీ (సీఎస్‌ఆర్‌) కమిటీల్లోనే చోటు దక్కుతూ వస్తోందని.. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోందని ఈవై తెలిపింది.  

వేదికలో మరిన్ని విశేషాలు.. 
♦ 24 శాతం మంది మహిళలతో లైఫ్‌ సైన్సెస్‌ రంగ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. మీడియా, వినోద రంగంలో ఇది 23 శాతంగా ఉంది. ఇక కన్జూమర్‌ ఉత్పత్తులు.. రిటైల్‌ రంగ కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంగా ఉంది. అత్యధికంగా మహిళా సిబ్బంది (34 శాతం) ఉన్న టెక్నాలజీ (ఐటీ, ఐటీఈఎస్‌) పరిశ్రమలో కూడా ఇది 20 శాతంగానే ఉంది. 
♦ ఎనర్జీ, యుటిలిటీస్‌ రంగ (చమురు, గ్యాస్, విద్యుత్‌ మొదలైనవి) కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 2017 నుంచి ఒకే స్థాయిలో 15 శాతంగా స్థిరంగా ఉంది. ఇంధన రంగంలో కేవలం 600 మంది మహిళలు మాత్రమే మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ హోదాల్లో ఉన్నారు. 
♦ అంతర్జాతీయంగా చూస్తే కంపెనీల బోర్డుల్లో 44.5 శాతం మహిళల ప్రాతినిధ్యంతో ఫ్రాన్స్‌ అగ్రస్థానంలో ఉంది. స్వీడన్‌ (40 శాతం), నార్వే (36.4 శాతం), కెనడా (35.4 శాతం), బ్రిటన్‌ (35.3 శాతం), ఆస్ట్రేలియా (33.5 శాతం), అమెరికా (28.1 శాతం), సింగపూర్‌ (20.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.    

Videos

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)