Breaking News

మహిళలు తీసుకోవాల్సిన పాలసీలు

Published on Fri, 03/08/2024 - 10:25

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు.

దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా..

ఆరోగ్య బీమా

ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి.

తీవ్ర వ్యాధులకు..

కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. 

వాహన బీమా

మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్‌ అయిపోయన తర్వాత రెన్యూవల్‌ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్‌ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. 

ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’

టర్మ్‌ పాలసీ

ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్‌ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)