నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?
Breaking News
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇదో కొత్త సమస్య!
Published on Sun, 09/06/2026 - 12:39
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలామంది ఉద్యోగులకు ఇష్టం. ఆఫీసుకు వెళ్లాల్సిన పని ఉండదు. ట్రాఫిక్ టెన్షన్ ఉండదు. ఇంట్లోనే ప్రశాంతంగా పని చేసుకోవచ్చని అనుకుంటాం. కానీ.. ప్రతి ఒక్కరికీ ఈ విధానం నచ్చకపోవచ్చు. ఎందుకంటే.. మోహిని చవాన్ అనే మహిళకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మానసికంగా అలసిపోయేలా చేసిందని పేర్కొంది.
శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడం చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆ అనుభవం తనను మానసికంగా అలసిపోయేలా చేసి, ఒకే రొటీన్‌లో ఇరుక్కుపోయేలా చేసిందని చవాన్ తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఆమె పనిచేసే సంస్థ సాధారణంగా హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుంది, కానీ.. ఉద్యోగులకు సంవత్సరంలో రెండు వారాల పాటు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఉంటుంది.
పని మాత్రం మారలేదు!
ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా పని మాత్రం మారలేదు. వర్క్‌లోడ్ కూడా అలాగే ఉంది. ఉదయం పని మొదలుపెట్టి.. సాయంత్రం వరకు అదే పని చేయాల్సి వచ్చింది. రెండు వారాలు ఇలా గడిచిన తర్వాత తనకు చాలా మానసికంగా అలసిపోయినట్లు అనిపించిందని మోహిని చెప్పింది. అసలు ఇంటి నుంచి బయటకు వచ్చినట్టే అనిపించలేదని తెలిపింది.
పర్మినెంట్‌గా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తారో నాకు తెలియదు. అలా చేస్తున్న వారికి చవాన్ సెల్యూట్ చేశారు. ఎందుకంటే.. రోజంతా ఇంట్లోనే ఉండటం, అదే పని చేయడం వల్ల ఒక రకమైన బోర్ ఫీల్ వచ్చిందని చెప్పారు. వీకెండ్ వస్తే కాస్త బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌ను కలవడం లేదా ఎక్కడికైనా వెళ్లడం సాధారణమే. కానీ మోహిని ఈ రెండు వారాల్లో వీకెండ్‌లో కూడా పెద్దగా బయటకు వెళ్లలేకపోయింది.
పూర్తిగా అలసిపోయా..
ఒక్కరోజు మాత్రమే బయటకు వెళ్లింది. మిగతా సమయంలో కూడా ఇంట్లోనే ఉంది. పని, తినడం, తాగడం.. మళ్లీ అదే రొటీన్ కొనసాగింది. దీంతో రెండు వారాలు పూర్తయ్యేసరికి తన మెదడు పూర్తిగా అలసిపోయినట్లు అనిపించిందని ఆమె చెప్పింది.
తిరిగి ఆఫీసుకు వెళ్లే అవకాశం రావడంతో మోహిని హ్యాపీగా ఫీల్ అయింది. తనకు హైబ్రిడ్ వర్క్ మోడల్ చాలా బెటర్ అని చెప్పింది. వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు వెళ్లడం వల్ల రొటీన్ నుంచి బయటకు రావచ్చు. సహోద్యోగులను కలవచ్చు. వారితో మాట్లాడవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కలిసి భోజనం చేయవచ్చు. తమ అనుభవాలను పంచుకోవచ్చు. ఇవన్నీ వర్క్ లైఫ్‌ను కాస్త ఆసక్తికరంగా మారుస్తాయని ఆమె అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్: 3 రోజులు బ్యాంకులు బంద్!
హైబ్రిడ్ మోడల్‌లో మరో ప్రయోజనం ఏంటంటే.. రోజులో కొంత సమయం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడం, తిరిగి రావడం వల్ల రోజువారీ రొటీన్‌లో మార్పు వస్తుంది. అదే పూర్తిగా ఇంటి నుంచే పనిచేస్తే ఇల్లు, ఆఫీస్ రెండూ ఒకే చోట అయిపోతాయి. దీంతో పని, వ్యక్తిగత జీవితం మధ్య తేడా తగ్గిపోవచ్చని చెప్పింది.
Tags : 1