Breaking News

హారిబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి!

Published on Mon, 03/06/2023 - 17:32

సాక్షి, ముంబై: ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు సంబంధించిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన మహిళకి నాన్‌ వెజ్‌ ఫుడ్‌ డెలివరీ చేసి కస్టమరుకు భారీ షాకిచ్చింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విటర్‌లో ఆమెషేర్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. పలువురు నెటిజనులు జొమాటోపై మండిపడుతున్నారు.  ఫలితంగా ఈ పోస్ట్ 6 లక్షలకు పైగా  వ్యూస్‌,  700 లైక్‌లను పొందింది.

జొమాటోలో శాఖాహారం ఆర్డర్ చేస్తే.. చికెన్ పంపించారంటూ నిరుపమా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.  ట్విటర్‌లో షేర్‌ చేసిన నాలుగు సెకన్ల చిన్న క్లిప్‌లో చికెన్‌ ముక్కను చిదుముతూ తన షాకింగ్‌ అనుభవాన్ని తెలిపారు.  ఇదేం సర్వీసురా బాబూ, భయంకరమైన అనుభవం అని ఆమె పేర్కొన్నారు.  దీనిపై జొమాటో స్పందించింది.  జరిగిన సంఘటనపై హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పింది.  దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. (జెరోధా నితిన్‌ నెల జీతం ఎంతో తెలుసా? ఈ తప్పులు చేయొద్దన్న బిలియనీర్‌)

అయితే  యూజర్లకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఓ యూజర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క దర్శనమిచ్చింది. ఈ వీడియోను కూడా ఆయన  షేర్‌ చేశారు. అయితే   స్పందించి క్షమాపణలు చెప్పినప్పటికీ జొమాటోతో తన "అసోసియేషన్" అధికారికంగా ఆ రోజు ముగిసిందని పేర్కొనడం గమనార్హం. 

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)