Breaking News

ఆఫీస్‌కు అర్లీగా వస్తోందని ఉద్యోగిని తొలగింపు

Published on Thu, 12/11/2025 - 14:55

స్పెయిన్‌లో ఒక విచిత్రమైన ఉద్యోగ వివాదం వార్తల్లో నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా 40 నిమిషాల ముందుగానే ఆఫీస్‌కు వస్తోన్న ఒక ఉద్యోగినిని ఆ కంపెనీ తొలగించింది. ఆఫీస్‌కు అర్లీగా వస్తే తొలగిస్తారా? అంటూ కంపెనీని కోర్టుకు లాగింది ఆ 22 ఏళ్ల ఉద్యోగిని. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి...

అసలేం జరిగిందంటే.. 
మెట్రో వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ఆ ఉద్యోగిని షిఫ్ట్‌ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ఆమె ఉదయం 6:45 నుంచి 7:00 గంటల మధ్యే ఠంచనుగా ఆఫీస్‌కు వెళ్లిపోయేది. ఉద్యోగిని ముందుగా రావడం ప్రారంభంలో మంచి అలవాటుగా కనిపించినా, ఆ సమయంలో ఆమె చేయడానికి ఎలాంటి పని లేకపోవడం, అలాగే ముందుగా రాకూడదన్న సంస్థ ఆదేశాలను ఆమె పదేపదే లెక్కచేయకపోవడం కంపెనీ యాజమాన్యాన్ని  అసహనానికి గురి చేసింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

కంపెనీ ఏం చెబుతోందంటే.. 
సంస్థ మాటల్లో.. ఉద్యోగి ముందుగానే రావడం వల్ల ఎటువంటి ఉత్పాదకతా అందించకపోగా, నిర్ణయించిన సమయాలకు కట్టుబడే నిబంధనలను సదరు ఉద్యోగిని నిర్లక్ష్యం చేసింది. పలుమార్లు మౌఖికంగా, రాతపూర్వకంగా హెచ్చరించినప్పటికీ ఆమె తన అలవాటు మార్చుకోలేదు. ఇక, ఆమె 19 సందర్భాల్లో ఆఫీస్‌ ప్రాంగణంలోకి రాక ముందే కంపెనీ యాప్‌లో లాగిన్‌ కావడానికి ప్రయత్నించినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇది మోసపూరిత చర్యగా కంపెనీ యాజమాన్యం పరిగణించింది.

తొలగింపు అన్యాయమంటూ కోర్టుకు..
తన తొలగిపింపును సవాలు చేస్తూ ఆ మహిళ అలికాంటే సోషల్ కోర్టును ఆశ్రయించింది. ఆమె వాదన ఏమిటంటే ముందుగా రావడం తప్పు కాదు. కంపెనీ యాజమాన్యం తనపట్ల అన్యాయం చేసింది.

భిన్నంగా కోర్టు తీర్పు
అయితే, కోర్టు ఈ వాదనలు అంగీకరించలేదు. గైర్హాజరు లేదా ఆలస్యంగా రావడం కాకుండా  అత్యధిక సమయపాలన కూడా నియమావళిని ఉల్లంఘించే పరిస్థితుల్లో సమస్యగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. సంస్థ నిబంధనలను పాటించడానికి ఉద్యోగి నిరాకరించిందని, ఇది స్పానిష్ వర్కర్స్ స్టాట్యూట్ ఆర్టికల్ 54ను ఉల్లంఘించడమేనని తీర్పులో పేర్కొంది.

అంతేకాకుండా ముందుగానే రావడం కారణంగా జట్టు సమన్వయానికి అంతరాయం ఏర్పడిందని మరో ఉద్యోగి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఉద్యోగిని తొలగించడం సముచితమేనని నిర్ణయిస్తూ కోర్టు యజమానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)