Breaking News

భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్‌ కంపెనీ బతికేలా చేసింది

Published on Sun, 11/17/2024 - 16:06

మెర్సిడెస్ బెంజ్.. ప్రపంచ మార్కెట్లో పరిచయం అవసరంలేని బ్రాండ్. ఈ రోజు లగ్జరీ కార్ల విభాగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు, బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయమే కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

మెర్సిడెస్ బెంజ్ ఈ రోజు ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది అంటే.. దానికి కారణం 'బెర్తా బెంజ్' అనే చెప్పాలి. మొదటిసారిగా ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమె సొంతమే. ఈమె మరెవరో కాదు.. కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ భార్య.

కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్.. జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆటోమోటివ్ ఇంజనీర్, ఇంజన్ డిజైనర్ కూడా. ఈయన 1885లో బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్‌ను సృష్టించారు. ఇదే అతని మొదటి ఆటోమొబైల్. అయితే ఇది రోడ్డుపై ఎలా పనిచేస్తుందనే విషయం మీద కొంత అనుమానం మాత్రం కార్ల్ బెంజ్ మనసులో ఉండేది. కానీ బెర్తా బెంజ్ మాత్రం ఆ వాహనం మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ కారణంగానే భర్తకు తెలియకుండానే ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది.

1888లో ఒకరోజు ఉదయం.. బెర్తా నిద్రలేచి, కార్ల్ బెంజ్‌కి తెలియజేయకుండా తన ఇద్దరు కుమారులు యూజెన్, రిచర్డ్‌లతో కలిసి కారులో ప్రయాణాన్ని ప్రారంభించింది. రోడ్డుపై వస్తున్న ఆ వాహనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దాన్ని మహిళ నడపడం చూసి చాలామంది మరింత ఆశ్చర్యపోయారు.

నిజానికి కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని రూపొందించినప్పుడు, దానిని విక్రయించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్ళ పాటు దాని అమ్మకాలు జరగలేదు. ఈ వాహనంలో బెర్తా 106 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత.. పేటెంట్ మోటర్‌వాగన్‌ను ప్రపంచం గుర్తించింది. ఆ తరువాత కంపెనీ అమ్మకాలు మొదలయ్యాయి.

ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..

బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్‌ అమ్మకాలు మొదలైన తరువాత కూడా కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని కంపెనీ విజయవంతంగా పరిష్కరించింది. బెర్తా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే.. బెంజ్ కారును ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. నేడు ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉందో.. ఎంతలా ఎదిగిందో అందరికీ తెలుసు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)