Breaking News

విప్రో చేతికి హర్మన్‌ డీటీఎస్‌.. రూ. 3,270 కోట్ల డీల్‌

Published on Fri, 08/22/2025 - 07:23

ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్‌కు చెందిన డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సొల్యూషన్స్‌(డీటీఎస్‌) బిజినెస్‌ యూనిట్‌ కొనుగోలుకి తెరతీసింది. శామ్‌సంగ్‌కు చెందిన ఈ సంస్థలో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు నగదు రూపేణా 37.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3,270 కోట్లు) వెచ్చించనుంది.

ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 5,600మంది డీటీఎస్‌ ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. 2025 డిసెంబర్‌31కల్లా లావాదేవీ పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. హర్మన్‌ కనెక్టెడ్‌ సర్వీసెస్‌ ఇంక్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి హర్మన్‌ ఇంటర్నేషనల్‌ ఇండస్ట్రీస్‌ ఇంక్‌తో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది.

తద్వారా హర్మన్‌ అనుబంధ సంస్థలుసహా.. సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. కొనుగోలు తదుపరి విప్రో ఇంజినీరింగ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ లైన్‌లో డీటీఎస్‌ విలీనంకానున్నట్లు వెల్లడించింది. కనెక్టికట్‌(యూఎస్‌) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీటీఎస్‌ అంతర్జాతీయంగా ఈఆర్‌అండ్‌డీ, ఐటీ సర్వీసులను అందిస్తోంది. ఎంబెడ్డెడ్‌ సాఫ్ట్‌వేర్, డిజిటల్‌ ఇంజినీరింగ్, డిజైన్‌ థింకింగ్, క్లౌడ్, ఇన్‌ఫ్రా సర్వీసులలో ప్రధానంగా కార్యకలాపాలు విస్తరించింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)