Breaking News

ఊహించినట్టుగానే జరిగింది.. భారీగా తగ్గిన విప్రో లాభాలు!

Published on Fri, 01/12/2024 - 18:55

దేశంలో పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలలో తీవ్రంగా నిరాశపరిచింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే లాభాల క్షీణత నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను విప్రో తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,065 కోట్లతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,700 కోట్లకు తగ్గిందని కంపెనీ నివేదించింది. అంటే దాదాపు 12 శాతం తగ్గింది.  ఈ లాభాల క్షీణత విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉండటం గమనార్హం.

క్యూ3 హైలైట్స్‌:

  • గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,229 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఏకీకృత విక్రయాలు రూ.22,205 కోట్లుగా ఉన్నాయి. 
  • సేవల శాతం ప్రకారం ఆఫ్‌షోర్ ఆదాయం 59.8 శాతంగా ఉంది. 
  • డాలర్ ఆదాయం 2.66 బిలియన్‌ డాలర్లు
  • ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 11 బేసిస్ పాయింట్లు తగ్గి 16 శాతంగా ఉంది.
  • మొత్తం బుకింగ్‌లు 3.8 బిలియన్‌ డాలర్లు
  • అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 14.2 శాతంగా ఉంది.

విప్రో ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జనవరి 24ని అదే రికార్డు తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 10న లేదా అంతకు ముందే మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని తెలిపింది. కాగా వచ్చే త్రైమాసికం (క్యూ4)లో ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి 2,615 మిలియన్‌ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల  వరకు రాబడి ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. సిబ్బంది నియామకాలు, వ్యాపార కార్యకలాపాలలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)