Breaking News

మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..

Published on Sat, 01/18/2025 - 15:48

కరోనా సమయంలో ఎంతోమంది టెకీలు జాబ్స్ కోల్పోయారు. డిసెంబర్ 2024లో కూడా దిగ్గజ కంపెనీలు సైతం లేఆప్స్ ప్రకటించాయి. కాగా ఇప్పుడు కొన్ని సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో టీసీఎస్ చేరింది. ఇప్పుడు తాజాగా విప్రో కూడా నేనున్నానంటూ.. ముందుకు వచ్చింది.

దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) 2025-26 (FY26) ఆర్థిక సంవత్సరంలో 10,000-12,000 మంది ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'సౌరభ్ గోవిల్' (Saurabh Govil) తన Q3FY25 ఆదాయ నివేదికను కంపెనీ విడుదల చేసిన తర్వాత, విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విప్రో తెలిపింది. అక్టోబర్ - డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో దాదాపు 7,000 మంది ఇప్పటికే ఆన్‌బోర్డ్‌లో ఉన్నారు. కాగా FY25 చివరి త్రైమాసికంలో మరో 2,500-3,000 మంది చేరే అవకాశం ఉంది. కాగా 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,39,655గా ఉన్నట్లు సమాచారం.

విప్రో, టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్
టీసీఎస్ కంపెనీ ఉద్యోగులను నియమించుకోవాలనే ప్రకటన చేసిన తరువాత, విప్రో కూడా ప్రకటించింది. ఈ వరుసలో ఇన్ఫోసిస్ కూడా చేసింది. FY26లో 20,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోవాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే లెక్కకు మించిన ఫ్రెషన్స్ ఐటీ కంపెనల్లో ఉద్యోగాలు పొందనున్నట్లు స్పష్టమవుతోంది.

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)