Breaking News

క్యూ1లో విప్రో ఓకే

Published on Sat, 07/20/2024 - 06:14

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది. 

రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్‌)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్‌ను ప్రకటించింది. బిలియన్‌ డాలర్లకు మించిన భారీ డీల్స్‌ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్‌ సిస్టమ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్‌ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు.  

12,000 మందికి చాన్స్‌ 
ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్‌ఆర్‌వో సౌరభ్‌ గోవిల్‌ వెల్లడించారు.  గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్‌ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది.   
షేరు బీఎస్‌ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు