Breaking News

విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!

Published on Thu, 02/01/2024 - 08:03

2024 ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. టెక్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం విప్రో వందలాదిమందిని తొలగించడానికి సిద్ధమైంది. సంస్థ లాభాల మార్జిన్‌లను మెరుగుపరచుకోవాలనుకుంటున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విప్రో కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపడుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం ఖర్చులను ఆదా చేయడానికి లేఆప్స్ ప్రక్రియను మొదలుపెట్టాయి. విప్రో కంపెనీ కూడా ఈ సంస్థలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇటీవల వెల్లడైన క్యూ3 ఫలితాలలో విప్రో ఆశించిన లాభాలను పొందలేకపోయింది. ఫలితాల ప్రకారం విప్రో లాభం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ. కాబట్టి కంపెనీ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్యోగులను తొలగించడానికి సంకల్పించింది.

ఇదీ చదవండి: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా..

ప్రస్తుతం విప్రో కంపెనీ లాభాలు పొందే దిశగా అడుగులు వేస్తోంది. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'అపర్ణ అయ్యర్' రాబోయే త్రైమాసికంలో కంపెనీ లాభాల మార్జిన్‌లను మెరుగుపరిచే బాధ్యతను తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. సంస్థ తొలగించనున్న ఉద్యోగులలో ఆన్‌సైట్‌లో పని చేసే మధ్య స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)