Breaking News

రూ.2వేల నోట్ల మార్పిడి గడువు ముగిసింది, ఆ రూ.12వేల కోట్లు తిరిగి వచ్చినట్లేనా

Published on Sun, 10/08/2023 - 09:46

దేశంలో రూ.2000 విలువైన నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌కు గడువు ముగిసింది. అయినప్పటికీ మార్కెట్లో రూ.12వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేశారు. ఎక్ఛేంజ్‌కి డెడ్‌లైన్‌ ముగిసినా నోట్ల మార్పిడి కొనసాగుతుందని అన్నారు. 

ఆర్‌బీఐ తొలుత నోట్ల మార్పిడి గడువు సెప్టెంబర్ 30 వరకూ అవకాశం ఇచ్చింది. తర్వాత గడువు ఈ నెల 7వ తేదీకి పొడిగించింది. మార్పిడి కావాల్సిన నోట్లు ఇంకా ఉండగా.. గడువు ముగియడంపై ఆర్‌బీఐ స్పందించింది. అక్టోబర్‌ 7 తర్వాత నోట్లను ఎక్ఛేంజ్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 

గడువు ముగిసినా నోట్లు మార్చుకోవచ్చు
దేశవ్యాప్తంగా 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2000నోట్లను ఒకేసారి రూ.20 వేల వరకూ డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పోస్టాఫీసుల ద్వారా కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపవచ్చు. అలా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపిన వారి బ్యాంకు ఖాతాలో ఆ నోట్ల విలువ సొమ్ము క్రెడిట్ అవుతుందని తెలిపారు. 

ఇప్పటి వరకు బ్యాంకులకు ఎంత వచ్చి చేరాయంటే
ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 87 శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చాయని, మిగిలినవి మార్చుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే  ఇంకా రూ.12,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తిరిగి రావాల్సి ఉందన్నారు. రూ. 2,000 నోట్ల మొత్తం విలువలో 96 శాతానికి పైగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. అక్టోబర్‌తో 7తో గడువు ముగిసింది. అక్టోబర్ 7 తర్వాత రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని స్పష్టం చేశారు. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)