Breaking News

ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్?

Published on Tue, 07/28/2026 - 20:46

2026 ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఇన్‌స్టా యూజర్లు ఆందోళనకు గురయ్యారు. కొందరు తమ ఫొటోలు, వీడియోలను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా సూచిస్తూ పోస్టులు చేశారు. అయితే.. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకారం.. సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధానికి సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, కొత్త నిబంధనలు లేదా నిషేధాలపై సమాచారం వస్తే.. సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. దీనిపై అధికారిక వర్గాల ద్వారా నిజానిజాలు తప్పకుండా తెలుసుకోవాలి. తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడుతుందని హెచ్చరించింది.

మొత్తం మీద.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోంది. వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అవుతుందనే వార్తలో ఎలాంటి నిజం లేదనే విషయం ప్రజలు గమనించాలి.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)