పసిడి ధర మరింత పెరుగుతుందా?

Published on Mon, 12/08/2025 - 07:30

బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా?            
  – శ్రావణి అద్దంకి

బంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్‌ క్లాస్‌కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.

రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు.  

నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో వేటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి?                                 – దీపక్‌

పెట్టుబడిలో తక్కువ రిస్క్‌ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్‌ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్‌ విషయంలో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ లేదా టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ లేదా లో కాస్ట్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్‌ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాలకు కేటాయించుకోవాలి.

సమాధానాలు:: ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)