Breaking News

'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఏమన్నారంటే?

Published on Wed, 04/05/2023 - 17:43

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ai) ఆధారిత టూల్స్‌ చాట్‌జీపీటీ (chatgpt) వంటి టెక్నాలజీలతో ఉద్యోగాలపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం ఉంటుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ సైతం స్పష్టం చేసింది.

ఆ సంస్థ నిర్వహించిన పరిశోధనల్ని ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరుతో పలు అంశాలు వెల్లడించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది.

ఈ తరుణంలో కేసీ న్యూటన్, కెవిన్ రూస్‌లతో జరిగిన న్యూయార్క్‌ టైమ్స్‌ హార్డ్ ఫోర్క్ పాడ్‌కాస్ట్‌లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ‘ఏఐతో ప్రమాదంలో ఉద్యోగాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్నకు సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ బార్డ్‌, చాట్‌జీపీటీలపై సానుకూలంగా స్పందించారు. 


 
గూగుల్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాలా? అని అడిగినప్పుడు.. ఎవరైనా టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందేనని పిచాయ్ అన్నారు. ఏఐ సాంకేతికత కారణంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఉత్పాదకత విషయంలో ఏఐల పనితీరును ప్రశంసించారు.  

‘ఏఐ వినియోగంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల విషయంలో రెండు విషయాలు నిజమవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ప్రోగ్రామింగ్‌లో మీ పని తీరు మరింత మెరుగుపడుతుంది. చాట్‌జీపీటీ, బార్డ్ వంటి ఏఐ టూల్స్‌ కారణంగా ప్రోగ్రామింగ్ అనేది అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి లేదంటే  సృష్టించడానికి వినియోగదారులకు అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా గూగుల్‌ బార్డ్ కాలక్రమేణా మెరుగుపడుతుందని చెప్పారు. ఓపెన్‌ ఏఐ పనితీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? అని అడిగినప్పుడు.. పిచాయ్ వారి విజయాన్ని చూసి తాను ఆశ్చర్యపోలేదని పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న (ఓపెన్‌ ఏఐ) వ్యక్తుల క్యాలిబర్ మాకు తెలుసు. కాబట్టే తాను ఆశ్చర్యపోలేదని తెలిపారు.

చదవండి👉 చాట్‌జీపీటీ జాబ్.. జీతం ఏడాదికి రూ.2.7కోట్లు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)