Breaking News

బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కావాలనే ఎగ్గొడితే.. రంగంలోకి ఆర్‌బీఐ

Published on Tue, 10/17/2023 - 21:23

దేశంలో ఆయా బ్యాంకుల వద్ద లోన్లు తీసుకుని ఉద్దేశ పూర్వకంగా ఎగవేతకు (ఎగ్గొట్టే) పాల్పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా అప్పులు తీసుకుని ఎగ్గొట్టి, మోసగించి తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్ల పని పట్టేందుకు ఆర్‌బీఐ నడుం బిగించింది.

ఇందులో భాగంగా ఆరునెలలు లోపాట ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడే వారితో పాటు లోన్లు తీసుకుని చెల్లించని వారిని గుర్తించేలా ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా నికర నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ)  జాబితాలో చేర్చాలని ఆదేశించింది. అయితే, డీపాల్టర్స్‌ లిస్ట్‌ను ఎన్ని రోజుల్లోగా గుర్తించాలనే అంశంపై సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టత ఇవ్వలేదు. 

ట్రాన్స్‌యూనియన్‌ డేటా ప్రకారం.. మార్చి 2023 నాటికి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన మొత్తం రూ.50,000 కోట్ల నుంచి రూ.353,874 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని 16,883 బ్యాంక్‌ అకౌంట్ల నుంచి తీసుకున్నారు.2022 మార్చి నెల సమయానికి 14,899 బ్యాంక్‌ అకౌంట్ల నుంచి రూ.304,063 మొత్తాన్ని తీసుకున్నారు. వెరసి నేషనల్‌ బ్యాంక్స్‌, ఎస్‌బీఐలలో రుణాలు తీసుకుని కావాలనే ఎగవేతకు పాల్పడింది 77 శాతంగా ఉంది.  

మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో 1,921 ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్లు ఉండగా.. ఆ అకౌంట్ల నుంచి తీసుకున్న మొత్తం రుణాల విలువ రూ.79,271 కోట్లు, నేషనలైజ‍్డ్‌ బ్యాంక్స్‌ 11,935 అకౌంట్లు ఉండగా రుణాలు మొత్తం రూ. 193,596 కోట్లు, ప్రైవేట్‌ బ్యాంక్‌ అకౌంట్లు  2,332 ఉండగా.. రుణాలు రూ. 54,250 కోట్లు, 2,231 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అకౌంట్లు ఉండగా ఆ రుణాల మొత్తం విలువ రూ.41,353 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌కు చెందిన 1,831 అకౌంట్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.35,623 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.22,754 కోట్లు తీసుకోగా అకౌంట్లు 340 ఉన్నాయి. ఐడీబీఐకి చెందిన 340 బ్యాంక్‌ అకౌంట్లు ఉండగా 24,192 కోట్లు ఉన్నాయి. మార్చి 2023 సమయానికి  36,150 ఎన్‌పీఏ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి రూ.9.24లక్షల కోట్లు వసూలు చేసింది. 

రుణాలు చెల్లించగలిగే శక్తి ఉన్నా.. కావాలనే ఎగవేతకు పాల్పడే ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు’గా గుర్తించేలా కఠిన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం ఇలాగే కొనసాగేలా ఎగ వేతదార్ల జాబితా బయటపెట్టనుంది. ఈ నిర్ణయం ఎంత మేరకు లాభిస్తుందో చూడాల్సి ఉందని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)