Breaking News

పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓ

Published on Thu, 09/26/2024 - 10:29

స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. సెబీ ఇటీవల చేసిన బ్రోకరేజ్‌ ఛార్జీలో మార్పుల వల్ల స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్ పోస్ట్‌లో మాట్లాడారు.

‘జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,370 కోట్ల ఆదాయాన్ని సంపాధించింది. అందులో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023లో కంపెనీ ఆదాయం రూ.6,875 కోట్లు, నికర లాభం రూ.2,900 కోట్లుగా ఉంది. మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్‌ (ఎంఐఐ)ల్లో పారదర్శకతను నిర్ధారించడానికి, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌లో నష్టపోయే బాధితులను తగ్గించేందుకు సెబీ ఇటీవల నిబంధనల్లో మార్పులు చేసింది. వాటి అమలుతో కంపెనీకి రానున్న ఏడాదిలో లాభాలు తగ్గనున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ విభాగంలో కంపెనీకు సమకూరే రాబడి 30-50% వరకు తగ్గనుంది’ అని చెప్పారు. సెబీ ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. దాదాపు 97 శాతం మంది ట్రేడర్లు ఈ విభాగంలో నష్టాలపాలవుతున్నట్లు గుర్తించింది. దాంతో నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి అక్టోబర్‌ 1 నుంచి అమలు కానున్నాయి.

ఇదీ చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు

నిబంధనల్లో మార్పులివే..

ఇండెక్స్ డెరివేటివ్‌ల కోసం కనీస కాంట్రాక్ట్ పరిమాణం ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. దాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. వచ్చే ఆరు నెలల్లో దీన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచనున్నారు. బ్రోకర్లు క్లయింట్ల నుంచి ఆప్షన్ ప్రీమియంలను ముందుగానే సేకరించవలసి ఉంటుంది. వీక్లీ ఎక్స్‌పైరీలను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్‌లు (ఎంఐఐ) ఇంట్రాడే(అదే రోజు ముగిసే ట్రేడింగ్‌) ప్రాతిపదికన ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తాయి.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు