Breaking News

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ షట్‌డౌన్‌!

Published on Thu, 06/19/2025 - 12:47

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్‌ సర్వీసుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు ఇంటర్నెట్ బ్లాక్అవుట్‌(ఇంటర్నెట్‌లో తీవ్ర అంతరాయం-పూర్తి బ్లాక్‌అవుట్‌ కాదు)ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతుందని, అందుకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ మేరకు ఇంటర్‌నెట్‌ను పరిమితం చేస్తూ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

ఇరాన్‌ ప్రభుత్వ నిర్ణయం ద్వారా వీపీఎన్‌(వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) సేవలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తిని అణచివేయాలని దాంతోపాటు సైబర్‌ దాడులను అరికట్టాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని ట్రాక్ చేసే కంపెనీలు కెంటింక్, నెట్‌బ్లాక్స్‌ను ఉటంకిస్తూ ఎన్‌బీసీ తెలిపిన నివేదిక ఆధారంగా ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం జూన్‌ 17, సాయంత్రం 5:30 గంటలకు ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. ఇది పూర్తిగా బ్లాక్అవుట్ కాదు. విదేశీ వెబ్‌సైట్‌లకు కనెక్ట్ అ‍య్యేందుకు అనుమతించే వీపీఎన్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తారనే ఆందోళనలతో వాట్సప్ వంటి యాప్‌లను ఉపయోగించకుండా ఉండాలని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఇదే మొదటిసారి కాదు..

ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేయడం లేదా ప్రజలు ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధించడం ఇది మొదటిసారి కాదు. 2019లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వరుసగా ఆరు రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌ విధించింది. అప్పుడు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్‌పై దాడుల తర్వాత 220 మందికి పైగా మరణించారని ఇరాన్ చెబుతుండగా, ప్రతీకార దాడుల్లో 24 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఇదీ చదవండి: పుత్తడి ఈ పూట రేటెంతంటే..

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ కూడా..

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లను కూడా ఇరాన్ నిలిపేసింది. ప్రజలు తమ డివైజ్లలో కొత్త యాప్‌లను డౌన్‌లోడ్‌, ఇన్‌స్టాల్‌ చేసుకోకుండా నిషేధం విధించింది. అదే సమయంలో వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్స్ ఇప్పటికే ఉన్న డివైజ్లలో పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఇరాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్‌లో భాగమైన ప్రభుత్వం ఆమోదించిన సైట్లు అందుబాటులో ఉన్నాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)