Breaking News

రూ.9,000 కోట్ల నిధుల సమీకరణ

Published on Wed, 10/16/2024 - 10:27

పానీయాల తయారీ కంపెనీ పెప్సీకోకు బాటిళ్లు సమకూర్చడంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న వరుణ్‌ బెవరేజెస్, ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ తాజాగా నిధుల సమీకరణ బాట పట్టాయి. వ్యాపార వృద్ధి, కొత్త ప్రొడక్టులు, కొత్త ప్రాంతాలకు విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు, రుణాల చెల్లింపునకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థలు తెలిపాయి.

వరుణ్‌ బెవరేజెస్ రూ.7,500 కోట్లు

అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు వరుణ్‌ బెవరేజెస్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వృద్ధి ప్రణాళికల అమలుకు వీలుగా క్విప్‌ ద్వారా రూ.7,500 కోట్లు మించకుండా సమకూర్చుకునేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలియజేసింది. అయితే ఇందుకు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా వాటాదారుల అనుమతులు సైతం కోరనున్నట్లు పేర్కొంది. క్విప్‌లో కనీసం 10 శాతాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌కు కేటాయించనుంది. నిధులను అనుబంధ, భాగస్వామ్య లేదా సహచర సంస్థలలో పెట్టుబడులకు వెచ్చించనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: ‘స్మార్ట్‌’ ఉన్నా ఫీచర్‌ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ రూ.1,500 కోట్లు

ఎన్‌సీడీలు(నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్‌ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు) జారీ ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వెల్లడించింది. ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో అర్హతగల ఇన్వెస్టర్లకు ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.1,500 కోట్లవరకూ సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇన్వెస్టర్ల జాబితాలో డీబీఎస్‌ బ్యాంక్‌(డీబీఎస్‌), హెచ్‌ఎస్‌బీసీ, సిటీకార్ప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(సింగపూర్‌), మిజుహో బ్యాంక్‌ సింగపూర్‌సహా ఇతర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఎన్‌సీడీలను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)